Bad Cholesterol Reduce Effective Diet Plan: శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ప్రస్తుతం ఆధునిక జీవనశైలిని అనుసరించడం కారణంగా చాలా మందిలో చెడు కొవ్వు పెరిగిపోతోంది. దీని కారణంగా గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. దీంతో పాటు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలు తీసుకునే క్రమంలో డైట్‌ పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారాలు డైట్‌ పద్ధతిలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీవనశైలిలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు వ్యాయామాలు కూడా తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు వ్యాయామాలు చేయడం వల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే కొలెస్ట్రాల్‌ నియంత్రించుకోవాలనుకునేవారు డైట్‌లో తప్పకుండా ఈ ఆహారాలు చేర్చుకోవాల్సి ఉంటుంది. 


సంతృప్త కొవ్వు తీసుకోవడం తగ్గించుకోండి:
ప్రతి రోజు మాంసం, పాల ఉత్పత్తులు, కొబ్బరి నూనెతో పాటు జంతువుల ఆధారిత ఆహారాల్లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి బదులుగా అవిసె నూనె, కనోలా నూనె కలిగిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచింది.


ట్రాన్స్ ఫ్యాట్‌ ఆహారాలు తినొద్దు:
ట్రాన్స్ కొవ్వులు అధిక పరిమాణాల్లో ప్యాక్ చేసిన స్నాక్‌లు, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఆహార పదార్థాల్లో లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి మంచి కొలెస్ట్రాల్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్‌ ఫ్యాట్ కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి:
కాయలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, గింజల్లో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో పీచు  కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు. 


చేపలను వారానికి రెండు సార్లు తినండి:
చేపలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి వారానికి రెండు సార్లు సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు తీసుకోవడం చాలా మంచిది.


(నోట్‌: మేము అందించిన పై సమాచారం  నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.)


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter