Weight gain Tips for Girls: అమ్మాయిలు.. సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవండి
అమ్మాయిలూ.... సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా..?? అయితే వర్రీ అవకండి.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు మీ శరీర బరువు సులుగా పెరిగిపోతుందండి
Weight gain Tips for Girls: ఒక మంచి శరీర ఆకృతికి మీ పట్టుదల మాత్రమే పునాది రాయి అవుతుంది. మీరు బరువు పెరగటానికి సిద్ధమయ్యే ముందు తినే పదార్థాల మీద ఒక అవగాహన ఉండటము మంచిది. బరువు పెరగడం అనేది ఏ మాత్రము లింగ పక్షపాతము కు సంబందించినది కాదు. కావున అబ్బాయిల లాగే అమ్మాయిలు కూడా బరువు పెరగవచ్చు.
అబ్బాయిలు, అమ్మాయిల కంటే ఎక్కువగా ఆటలు, క్రీడలు ఆడటం వలన వారికి త్వరగా, ఎక్కువగా ఆకలి అవడం సహజం. కావున కొన్ని చిట్కాలు పాటించడం వలన అమ్మాయిలు కూడా త్వరగా బరువు పెంచుకోవచ్చు.
Also Read: Snake Hair Band: హెయిర్ బ్యాండ్‌గా బతికున్న పాము.. ఇదెక్కడి ఫ్యాషన్ అంటున్న నెటిజన్లు
తినడం, తినడం మరియు తినడం
ఎవరైన సరే తింటనే బరువు పొందుతారు. తినే ఆహరంలో కావలిసిన కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యమైన కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఉదయం, మద్యాహ్నం మరియు రాత్రి మాత్రమే తినాలి అనే అపోహని వదిలేసి రోజంతా ఒక నిర్ణీతమైన సమయాలలో తినడం వలన మంచి బరువు పెరుగుతారు. ఒక ఆహార పట్టిక తయారు చేసుకొని, ప్రతి 2.5 నుంచి 3 గంటలకి ఒకసారి తినేలాగ చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్డ్లు మరియు మాంస పదార్థాలు తినేలాగా చూసుకోవాలి. రోజంతా తినాలి అని అన్ని తినకూడదు. భోజనంతో పాటు ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవటం కూడా ఉత్తమమే.
క్రమం తప్పకుండ వ్యాయామం
వ్యాయామం మరియు వివిధ పనులు చేయడం వలన మీ కేలోరీలు ఖర్చు అయ్యి.. మంచి శరీర ఆకృతి పొందుతారు. లేకుంటే మీ శరీరంలో కేలోరీలు ఎక్కువై కొవ్వు పేరుకుపోతుంది. దాని వలన మీ శరీర ఆకృతి దెబ్బ తింటుంది. మీరు కనుక జిమ్ కి వెళ్లాలనుకుంటే, ట్రేడ్ మిల్ అనేది ఒక ఉత్తమమైన వ్యాయామం అవుతుంది. ట్రేడ్ మిల్ మీద ఒక అరగంట పాటు రన్నింగ్ చేసినట్లయితే మీరు మంచి శరీరాకృతిని పొందుతారు.
Also Read: Pakistan Vs New Zealand: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్‌ను న్యూజిలాండ్ నిలువరించగలదా..??
కేలోరీలను లెక్కించడం
మీరు బరువు పెరుగుటకు ఒక ఆహార పట్టికను అనుసరించవలెను. ప్రతి వారం చివరి రోజున మీ బరువుని చెక్ చేసుకోండి. దాని వలన మీరు ఎంత బరువు పెరిగారో తెలుస్తుంది. మీరు తీసుకునే ఆహరం ఎక్కువ కేలోరీలు కలిగి ఉండి... తక్కువ షుగర్ లను కలిగి ఉండాలి. మీరు రోజువారీగా కేలోరీలను లెక్కించండి, అలా అని మీ ఆహారపు అలవాటు మార్చకండి. మీ పద్ధతిలోనే తింటూ మీ కేలోరీలను లెక్కించుకోండి. ఇలా చేయడం అనేది మీ బరువు పెరుగుటకు ఒక మంచి ప్రణాళిక అవుతుంది.
బరువు పెరగడం అనేది ఒక కోరిక. మీరు తక్కువ బరువుతో, సన్నగా ఉన్నరంటే వెంటనే త్వరితమైన మరియు ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి ప్రయత్నించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి