Empty Stomach Foods: ఖాళీ కడుపుతో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..
Empty Stomach Foods In Telugu: రోజంతా యాక్టివ్ గా ఉండడానికి మనం తీసుకునే అల్పాహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట పోషకాలు ఫైబర్ అధిక మోతాదులో ఉండే ఆహారాలకి తీసుకోవడం ఎంతో మంచిది. ఇటీవలే అధ్యయనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కింది ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Empty Stomach Foods In Telugu: రోజంతా ఆరోగ్యంగా ఉండడానికి చక చకా పనిచేయడానికి ఉదయం తీసుకునే అల్పాహారాలే కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇవే మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఉదయం పూట ఏదో ఒక అల్పాహారం తప్పకుండా తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది అనారోగ్యకరమైన అల్పాహారాలనే ఎక్కువగా తింటూ ఉంటారు. నిజానికి అనారోగ్య కరమైన అల్పాహారాలు తీసుకోవడం కారణంగా ప్రస్తుతం శరీరంపై అంతగా ప్రభావం చూపినప్పటికీ.. భవిష్యత్తును దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం తీసుకునే ఆహారాలు పోషకాలు కలిగినవి ఉండాలి. ఇటీవలే ప్రపంచ స్థాయిలో కొన్ని యూనివర్సిటీలు అధ్యయనాలు చేసిన ప్రకారం ఉదయం పూట కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నాయి. అయితే రోజంతా శరీరం యాక్టివ్ గా ఉండడానికి ఉదయం పూట ఖాళీ కడుపున ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం పూట తినే ఆహారాలు తప్పకుండా రోజంతా శరీరానికి తక్షణ శక్తినిచ్చే పోషకాలు కలిగినగా ఉండాలి. అంతేకాకుండా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ప్రతిరోజు అల్పాహారాలు తీసుకోవడానికి, ముందుగా ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మరసం తీసుకోవడం వల్ల మరెన్నో మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభావవంతంగా సహాయపడతాయి.
ఉదయం పూట ఖాళీ కడుపున నానబెట్టిన పాదం లేదా పిస్తా తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు చెడు కొవ్వును నియంత్రించి, మంచి కొవ్వును పెంచేందుకు సహాయపడతాయి. దీంతో పాటు జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా ఓట్స్ తో తయారు చేసిన ఆహారాలను కూడా తినవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు సహాయపడతాయి. దీంతో పాటు డయాబెటిస్తో బాధపడే వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా గుండె జబ్బులను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.
ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ చేతులు కీళ్లనొప్పులను నివారించేందుకు ఎంతగానో సహాయపడతాయి. దీంతో పాటు బాడీ పెయింట్స్ మంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు జియా గింజలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ప్రోటీన్స్ ఆకలిని నియంత్రించేందుకు బరువును తగ్గించేందుకు సహాయపడతాయి.
కాబట్టి బరువు పెరిగే వారు తగ్గాలనుకుంటే తప్పకుండా అల్పాహారంలో తీసుకోవాల్సిన ఉంటుంది. దీంతో పాటు బొప్పాయి పండ్లను కూడా తీసుకోవడం కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఆస్తమా ఎముకల సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే కలబంద రసం తాగడం కూడా చాలా మంచిది. ఈ రసం శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి