Hair Loss: ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ విటమిన్ల్ చాలా అవసరం..
Vitamin Deficiencies Cause Hair Loss: ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం. అలాగే మార్కెట్లో లభించే షాంపూలు, ఆయిల్స్ వాడటం. శరీరానికి కావాల్సిన పోషకాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Vitamin Deficiencies Cause Hair Loss: ఆరోగ్యకరమైన జుట్టు కోసం చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు కోసం ఖరీదైన షాంపూలు, ఆయిల్స్‌ను కూడా ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించదు. జుట్టు రాలే సమస్యకు కారణం మన మారిన ఆహార అలవాట్లని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మనం తీసుకొనే ఆహారంలో సరైన పోషకాలు అందకపోతే ఈ సమస్య బారిన పడుతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రొటీన్, ఐరన్‌తో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. మీ జుట్టు కుదుళ్ల ఆరోగ్యం, పెరుగుదలకు ఈ విటమిన్‌లు, మినరల్స్ ఎంతో మేలు చేస్తాయి. మీరు దీని కోసం మందులు, ప్రొడెట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇవి మనం రోజు తీసుకొనే ఆహారంలో లభిస్తాయి. ఎలాంటి విటమిన్‌లు తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది అంటే ..
విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్:
ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ బితో కూడిన పదార్థాలను తీసుకోవాలి. అలాగే విటమిన్ బి7 ఆహార పదార్థాలు జుట్టు పెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయి.
విటమిన్ డి:
విటమిన్ డి కేవలం ఎముకలకు మాత్రమే కాకుండా మీ జుట్టు పెరుగుదలలో కూడా ఉపయోగపడుతుంది. విటమిన్ డి లోపించడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య వస్తుంది. విటమిన్ డి కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.
విటమిన్ సి:
విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ సి ఎంతో సహాయపడుతుంది. జుట్టు రాలకుండా సహాయపడుతుంది. ఈ విటమిన్ సి కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం జుట్టుకు ఎంతో అవసరం.
Also Read Boiled Foods Benefits: బాయిల్ చేసే ఆహారంలో పోషకాలు అధికంగా ఉంటాయా
ఐరన్:
ఆహారంలో తగినంత ఐరన్ లేకపోవడం వల్ల రక్తహీనత సమస్యకు దారి తీస్తుంది. జుట్ట రాలే సమస్యకు కారణం అవుతుంది. కాబట్టి ఐరన్‌తో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం.
జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, జుట్టు పల్చబడడం వంటి సమస్యలకు ముఖ్యకారణం పోషక ఆహారం లోపించడం. పోషక ఆహార వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మీ జుట్టు ఒత్తుగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి మీ ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోండి.
Also Read Dry Cough Home Remedies In Telugu: పొడి దగ్గు నుంచి శాశ్వతంగా విముక్తి కలిగించే ఇంటి చిట్కాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter