గత ఏడాది కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలోనూ భారత్‌లో 24 గంటల వ్యవధిలో ఒక్కరోజు కూడా లక్ష కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజులో లక్షకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. భారత్‌లో గురువారం ఒక్కరోజే 1,31,968 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 780 కోవిడ్19 మరణాలు సంభవించాయి. కరోనా సెకండ్ వేవ్ బారి నుంచి తప్పించుకోవాలంటే కోవిడ్19 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైద్య నిపుణులు, ఆరోగ్య సిబ్బంది కరోనా కేసుల అనూహ్య పెరుగుదలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఆసక్తికర విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. ఎండలో బయటతిరిగే వారిలో, ప్రతిరోజూ కొంత సమయం ఎండలో ఉండే వ్యక్తులలో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉందట. ఈ విషయాన్ని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ పబ్లిష్ చేసింది. ఎండ తీవ్రత ఉన్న చోట ఉండేవారు, మండుటెండలో బయట తిరుగుతున్న వారిలో కోవిడ్19 మరణాలు తక్కువగా సంభవిస్తున్నాయి. సూర్యడి యూవీఏ కిరణాలు మిమ్మల్ని కరోనా మరణాల(CoronaVirus Cases) బారిన పడకుండా కాపాడుతుందని అధ్యయనంలో గుర్తించారు. 


Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి


అధ్యయనం చేస్తున్న నిపుణులు అమెరికాలో జనవరి 2020 నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో అతినీలలోహిత కిరణాలపై పరిశోధన చేశారు. సూర్యరశ్మికి బయట తిరిగేవారిలో మరణాలు తక్కుగా ఉన్నట్లు తేలింది. సిడ్నీకి చెందిన ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ సైతం ఇదే విషయాన్ని నిర్ధారించింది. ఇటలీ, ఇంగ్లాండ్‌కు చెందిన పరిశోధకులు సైతం సూర్యరశ్మికి, కరోనా మరణాలకు సంబంధం ఉందని చెబుతున్నారు. బయటకు ఎక్కువగా వెళ్లకుండా ఉండేవారు, ఇంట్లో ఉంటూ ఇతరకుల ద్వారా కరోనా సోకిన వారిలోనే మకరోనా కోవిడ్19(COVID-19) మరణాల రేటు అధికంగా ఉన్నట్లు పలు అధ్యయనాలలో తేలింది. 


Also Read: CoronaVirus Cases In India: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి


విటమిన్ డి, అతినీల లోహిత కిరణాలు
 ఎండలో ఉండే విటమిన్ డి శరీరానికి లభిస్తుందని తెలిసిందే. అయితే ఎండలో ఉండే వారికి ‘విటమిన్ డి’తో పాటు అతినీలలోహిత కిరణాలను ఎదుర్కొనేలా చర్మం మారుతుంది. యూవీ కిరణాల తీవ్రతను ఎదుర్కొంటున్నారంటే అందుకు కారణం మీ రోగనిరోధక శక్తి అధికం కావడమని నిపుణులు తెలిపారు. విటమిన్ డి అధికంగా ఉండే ఎముకలు పటిష్టంగా మారతాయి. రక్తకణాల పనితీరు మెరుగవుతుంది. ఎండ తీవ్రత కారణంగా విడుదలయ్యే నైట్రిక్ ఆక్సైడ్ SARS-CoV-2 ప్రభావాన్ని తగ్గిస్తుందని పలు అధ్యయనాలలో వెల్లడైంది.


Also Read: COVID-19 Positive Cases: తెలంగాణలో తాజాగా 2500 చేరువలో పాజిటివ్ కేసులు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook