Vitamin Deficiencies For Dull And Dry Skin:  విటమిన్స్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. విటమిన్స్ లోపం వల్ల చర్మ సమస్యలు బారిన పడుతాము. అయితే ఏయే విటమిన్లు లోపించడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి అనేది మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్‌ ఇ లోపించడం వల్ల చర్మం నీరసంగా కనిపిస్తుంది. అంతేకాకుండా విటమిన్‌ ఇ చర్మం కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. విటమిన్‌ ఇతో  తయారు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. 


విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల కూడా చ‌ర్మ స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. దీనికి కారణంగా తరుచు ఇన్షెక్షన్‌ సమస్యల బారిన పడుతుంటారు. విటమిన్‌ డి పొందడం కోసం సాల్మన్‌, వకాడ్‌ లివర్‌ ఆయిల్, సూర్యరశ్మిని పొందడం చాలా మంచిది.



విటమిన్‌ సి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి ఫ్రీరాడికల్స్ బారిన చ‌ర్మాని కాపాడుతుంది. విట‌మిన్ సితో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.


విట‌మిన్ బి తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అంతేకాకుండా మచ్చలు, దద్దుర్లు రాకుండా సహాయపడుతుంది.


విట‌మిన్ ఎ చర్మమానికి ఎంతో అవ‌స‌రం. తామ‌ర వంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు రాకుండా విటమిన్‌ ఎ రక్షిస్తుంది.



ఈ  విధంగా చ‌ర్మ ఆరోగ్యానికి  విట‌మిన్స్ చాలా అవ‌స‌ర‌ం. శ‌రీరంలో విట‌మిన్స్ లోపం లేకుండా చూసుకోవడం చాలా అవసరం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Sperm Count: ఈ గింజలు మగవారి శక్తిని అమాంతం పెంచుతాయి..వీర్యకణాల సంఖ్య కూడా బూస్ట్ అవుతుంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter