Sperm Count Increase Tips: ఆధునిక జీవనశైలి కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తినడంతో బరువు పెరిగి ఊబకాయం సమస్య బారిన పడుతున్నారు. దీని ప్రభావం టెస్టోస్టిరాన్ హార్మోన్ పై పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చాలామందిలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోయి..వీర్యం పల్చబడిపోతోంది. దీంతో కొంతమందిలో సంతానలేమి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా శరీరంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు 5 గ్రాముల చొప్పున ఉదయం పూట మెంతులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.. అంతేకాకుండా సాయంత్రం పూట కూడా 5 గ్రాములు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య పెరగడమే కాకుండా శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మెంతులలో ఉండే గుణాలు ఇన్సులిన్ నిరోధకత తగ్గించేందుకు కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలా ప్రతిరోజు మెంతులను తీసుకున్న వారిలో ఒక నెలలోపలే వీర్యకణాల సంఖ్య పెరిగిందని ఆప్లైడ్ న్యూట్రిషియన్ ఆండ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. కాబట్టి సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా మెంతులను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పాలలో ఖర్జూరాను మిక్స్ చేసుకొని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు లైంగిక శక్తిని పెంచేందుకు కూడా సులభంగా సహాయపడతాయి.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
కొంతమందిలో శరీర బరువు పెరగడం కారణంగా కూడా వీర్యకణాల సంఖ్య తగ్గిపోతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీర్యకణాలు పెరగడానికి తప్పకుండా బరువు తగ్గడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు పోషకాలు కలిగిన ఆహారాలు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter