Fatigue Causes: ప్రతిరోజు అలసిపోతున్నారా? ఇది సోమరితనం కాదండోయ్..తీవ్ర వ్యాధులకు సంకేతాలు..
Fatigue Causes: తరచుగా అలసిపోవడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలామంది యువత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడానికి ప్రధాన కారణం అలసట నేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అలసట రావడానికి కారణాలేంటో మీకు తెలుసా.?
Fatigue Causes: చాలామంది ఆఫీసుల్లో గంటల తరబడి పనులు చేసి ఇంటికి రాగానే బెడ్ పై వాలిపోతూ ఉంటారు. మరికొంతమంది అయితే అలాగే పడుకొని బద్దకంగా ఉంటారు. ఆఫీసు బిజీ లైఫ్ లో అలసిపోవడం మామూలు విషయమే.. కానీ కొంతమందిలో నిద్రపోయిన తర్వాత కూడా చాలా అలసిపోతూ ఉంటారు. అయితే ఇలా క్రమంగా జరిగితే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా అలసిపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని, దీని కారణంగా తీవ్ర మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యులు అంటున్నారు. దీంతో భవిష్యత్తులో గుండెపోటు సమస్యలతో పాటు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే చాన్సులు ఉన్నాయి.
ప్రతిరోజు అలసట ఎందుకు వస్తుందో తెలుసా?:
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు తప్పనిసరిగా నిద్ర పోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలామంది స్మార్ట్ ఫోన్స్ కారణంగా సినిమాలు చూస్తూ లేట్ నైట్ పడుకుంటున్నారు. దీంతో వారు ఉదయాన్నే అలసటతో నిద్ర లేస్తున్నారు. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల చాలామందిలో అలసట అనేది సాధారణమైపోయింది. ఈ అలసట కారణంగానే చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.
అలసట కారణంగా వచ్చే వ్యాధులు:
✾ ప్రతిరోజు అలసిపోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి. శరీరానికి తగిన పరిమాణంలో విశ్రాంతి లేకపోవడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీని కారణంగా అలసట, దాహం పెరగడం, మూత్ర విసర్జన చేయాలనే కోరికలు పెరగడం, ఒక్కసారిగా బరువు తగ్గడం, దురద, అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి లేట్ నైట్ నిద్ర పోవడం మానుకోవాలి.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
✾ ఆధునిక జీవనశైలిలో డిప్రెషన్ అనేది సాధారణ సమస్యగా మారింది. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ఏదో ఒక సమయంలో డిప్రెషన్ కు గురవుతూనే ఉన్నారు. చాలామందిలో డిప్రెషన్ రావడానికి ప్రధాన కారణాలు నిద్రలేక పోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల శరీరం అలసటకు గురై డిప్రెషన్ సమస్య బారిన పడుతున్నారని వారంటున్నారు.
✾ తరచుగా అలసిపోవడం వల్ల రక్తహీనత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఉన్నాయి. శరీరంలోని ఐరన్ పరిమాణాలు తగ్గిపోతాయి. ఇలాంటి సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
✾ అలసట కారణంగా థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రోజు అలసిపోయేవారిలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని చిన్న వయసులోనే థైరాయిడ్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి యువత రాత్రి పూటలు మేల్కోవడం మానేసి శరీరానికి తగినంత రెస్ట్ ఇవ్వడం చాలా మంచిది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి