Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 ప్రయాణం ముగియనుంది. అంటే కేవలం 14 రోజులేనా చంద్రయాన్ 3 జీవితకాలం. ఆ తరువాత ఏం కానుంది. పూర్తి వివరాలు ఇలా

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 31, 2023, 09:44 AM IST
Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

Chandrayaan 3: ఆగస్టు 23వ తేదీ సాయంత్రం ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని దక్షిణ ధృవంపై ఇండియా అడుగెట్టింది. చంద్రయాన్ 3 విజయవంతంతో సరికొత్త చరిత్ర లిఖించింది. ఇచ్చిన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ జీవితకాలం త్వరలోనే ముగియబోతోంది. ఆ తరువాత పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది..

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్- 3 41 రోజుల ప్రయాణం తరువాత ఆగస్టు 23 వతేదీ సాయంత్రం 6.04 గంటలకు విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయింది. అప్పట్నించి చంద్రుడి ఉపరితలంపై పరిశోధన చేయడం, విలువైన సైంటిఫిక్ డేటా సేకరించడం, మరీ ముఖ్యంగా నీటి జాడ కనుక్కోవడం ప్రధాన లక్ష్యాలు. చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన దక్షిణ ధృవంపై శాశ్వతంగా నీడలో ఉండే ప్రాంతం కావడంతో పెద్ద పెద్ద క్రియేచర్స్, భవిష్యత్‌లో మనిషి నివసించేందుకు కావల్సిన వాతావరణం ఉన్నాయనేది శాస్త్రవేత్తల భావన. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ఈ అంశాలపైనే పరిశోధన జరుగుతోంది. ఏడురోజులుగా దక్షిణ ధృవంపై తిరుగుతూ కీలకమైన అంశాన్ని ఇటీవలే వెలువరించింది. చంద్రునిపై సల్ఫర్ జాడలున్నాయని ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా తెలిసింది.

ప్రజ్ఞాన్ రోవర్ జీవిత కాలం చంద్రునిపై 14 రోజులే. ఇప్పటికే 7 రోజులు పూర్తయ్యాయి. మరో ఏడు రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంది ప్రజ్ఞాన్ రోవర్. చంద్రుడిపై ఒక రోజంటే భూమిపై 28 రోజులతో సమానం. అంటే 14 రోజులు మాత్రమే సూర్య రశ్మి ఉంటుంది.14 రోజులే ల్యాండర్‌లో సోలార్ బ్యాటరీలు పనిచేస్తాయి. మిగిలిన 14 రోజుల్లో చంద్రునిపై ఉష్ణోగ్రత మైనస్ 180-250కు పడిపోతుంది. ఈ సమయంలో సౌరశక్తితో పనిచేసే రోవర్ దాదాపుగా నిస్తేజమైపోతుంది. చంద్రునిపై పగలు ప్రారంభమయ్యేసరికి తిరిగి ప్రజ్ఞాన్ jరోవర్ ఎంతవరకూ పనిచేస్తుందనేది ఇంకా శాస్త్రవేత్తలకే స్పష్టత లేదు. 

Also read: Lunar Eclipse 2023: చివరి చంద్ర గ్రహణం సమయం, తేదీ ఎప్పుడు, సూతక కాలం ఉంటుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News