Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తుందా
Fatty Liver: ఇటీవలి కాలంలో ఫ్యాటీ లివర్ ప్రధాన సమస్యగా మారింది. ఆధునిక జీవనశైలిలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంటుంది. సులభంగా నియంత్రించవచ్చు గానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ప్రమాదకర సమస్యగా మారుతుంది.
Fatty Liver: ఉరుకులు పరుగుల బిజీ లైఫ్‌లో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి వివిధ రకాల వ్యాధులకు కారణమౌతున్నాయి. అందులో ఒకటి ఫ్యాటీ లివర్. శారీరక శ్రమ అంటే వ్యాయామం లేదా వాకింగ్ లేకపోవడం మరో కారణం. ప్రతి 10 మందిలో 7-8 మందికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ అనేది కేవలం లివర్‌కు పరిమితం కాదు..శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది.
అసలు ఫ్యాటీ లివర్ సమస్యేంటనేది తెలుసుకుందాం. వైద్యులు చెప్పిందాని ప్రకారం లివర్‌లో 5 శాతం కంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటే దానిని ఫ్యాటీ లివర్ అంటారు. లివర్‌లో ఉండే కణాలు మనం తినే ఆహారాన్ని ఇన్సులిన్‌తో కలిపి జీర్ణమయ్యేట్టు చేస్తాయి. రక్తంలోని పంచదారను ఎనర్జీగా మారుస్తాయి. అదే లివర్‌లో ఫ్యాట్ ఉంటే ఇన్సులిన్ కణాల్లో ప్రవేశించేందుకు కష్టమౌతుంది. శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇన్సులిన్ ఎక్కువ అవసరమౌతుంది. ఈ పరిస్థితుల్లో పాంక్రియాస్ అనేది 5-10 ఏళ్ల వరకు ెక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. క్రమంగా ఇన్సులిన్ తయారు చేసే పాంక్రియాస్ అలసిపోతాయి.
పాంక్రియాస్ అలసినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. దాంతో డయాబెటిస్ వ్యాది సంక్రమిస్తుంది. ఫ్యాటీ లివర్ ఉంటే రక్తంలో కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అంటే కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య పెరిగే కొద్దీ క్రమంగా గుండె వ్యాధులు ఎదురౌతాయి. గుండెలో కూడా కొవ్వు పేరుకుంటుంది. ఇదే కొవ్వు రక్తంలో చేరుకుంటుంది. దాంతో రక్తపోటు వ్యాధి తలెత్తుతుంది. కొవ్వు గుండెలో చేరుకుంటే హార్ట్ ఎటాక్ వ్యాధులు రావచ్చు. ఫ్యాటీ లివర్ సమస్య పెరిగితే అదే కొవ్వు మెదడుకు చేరుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ సమస్య రావచ్చు. అందుకే ఫ్యాటీ లివర్ సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
Also read: Root Canal and Heart: రూట్ కెనాల్ చికిత్సతో హార్ట్ ఎటాక్ వస్తుందా, నిజమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.