Ragi Laddu Health Benefits: మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు రాగులలో అధికంగా లభిస్తాయి. రాగుల‌తో ఎక్కువ‌గా జావ‌, సంగ‌టి, రోటి, ల‌డ్డూ వంటి వాటిని త‌యారు చేసుకుంటాం. కానీ  రాగుల‌తో చేసే ల‌డ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి.  అంతేకాకుండా  ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ రాగి ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాగి ల‌డ్డూకి కావల్సిన ప‌దార్థాలు:


ఒక క‌ప్పు రాగులు,  పావు క‌ప్పు మిన‌ప‌గుళ్లు, నాలుగు యాల‌కులు, బెల్లం త‌రుము త‌గినంత‌,  పావు క‌ప్పు జీడిప‌ప్పు ప‌లుకులు, నెయ్యి పావు క‌ప్పు.


రాగి ల‌డ్డు తయారీ విధానం:


ముందుగా రాగులను ఒక కళాయిలో తీసుకొని దోరగా వేయించాలి. తరువాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. తరువాత పలీలు వేయించాలి. జార్ లో మిన‌ప‌గుళ్ల‌ను  తీసుకొని ఇందులోకి యాల‌కుల‌ను కూడా వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి.  త‌రువాత అదే జార్ లో రాగుల‌ను వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని దీనిని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. 


Also read: Knee Pain Relief: కీళ్ల నొప్పితో బాధపడున్నారా? ఈ చిట్కాలను ప్రయత్నించండి!


ఈ రాగి పిండిని జార్ లోనే ఉంచి అందులోనే బెల్లం తురుము వేసి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇవి అన్నీ బాగా కలపాలి. ఒక గిన్నెలో నెయ్యిని వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక కొద్దిగా పిండిలో వేసుకుంటూ క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన మోతాదులో తీసుకుని పిండిని తీసుకుని ల‌డ్డూల చుట్టుకోవాలి.


ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ల‌డ్డూలు త‌యార‌వుతాయి. ఈ ల‌డ్డూలు నెల‌రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటాయి. పిల్ల‌ల‌కు ఈ ల‌డ్డూల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Anjeer Uses: అంజీర్ తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అన్ని మాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter