Fish Oil For Face: చేప నూనె ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు, ముడతలు పోతాయి!
Fish Oil For Face: మీరు చేపలు తినకపోతే..కనీసం చేప నూనెనైనా ముఖానికి రాసుకోండి. ఎందుకంటే మీ ముఖం మెరవడానికి, నల్లటి మచ్చలు తొలగిపోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.
Fish Oil Benefits: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నా ఆహారాన్ని తీసుకుంటే ముఖం మెరవటంతోపాటు చర్మానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతోంది. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు(Omega 3 Fatty Acid) పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా చేపలు తినని వారు.. చర్మ సంరక్షణకు ఎక్కువగా చేపనూనె (Fish Oil) ఉపయోగిస్తారు. చర్మ సంరక్షణలో ఎక్కువగా విటమిన్ ఇ క్యాపూల్స్ వాడతారు. కానీ చేపనూనెను మీ బ్యూటీ రోటిన్ లో భాగంగా చేసుకుంటే...ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
నల్లటి మచ్చలు తొలగిస్తుంది..
నల్లటి మచ్చలు (Black Circles) తొలగించడానికి మీరు చేప నూనెను ఉపయోగించవచ్చు. దీని కోసం, ముందుగా మీరు చేప నూనెను తీసుకుని.. ఆ బ్లాక్ స్పాట్ ఉన్న ప్రదేశంలో రాయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ చర్మం హీల్ అవ్వడం మొదలవుతుంది మరియు మీ చర్మం నుండి నల్లటి మచ్చ పోతుంది.
ముడతలు పోగొడుతుంది...
ఫేస్ మసాజ్ కోసం మీరు ఈ నూనెను ఉపయోగించవచ్చు. అదేవిధంగా చర్మంపై ముడతల సమస్య ఉంటే, చేప నూనె ఉపయోగించటం చాలా మంచిది. వారానికి రెండు మూడు సార్లు చేప నూనెతో మసాజ్ చేయండి.
Also Read: Kidney Stone Patients: మీ కిడ్నీల్లో రాళ్లున్నాయా..అయితే ఈ ఆహార పదార్ధాలు పూర్తిగా మానేయాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.