Kidney Stone Patients: మీ కిడ్నీల్లో రాళ్లున్నాయా..అయితే ఈ ఆహార పదార్ధాలు పూర్తిగా మానేయాల్సిందే

Kidney Stone Patients: మీ కిడ్నీలో రాళ్లున్నాయా..అయితే ఈ పదార్ధాలు మీకు విషంతో సమానమే మరి. వెంటనే ఇవాళే మీ డైట్ నుంచి ఈ ఆహారపదార్ధాల్ని తొలగించమంటున్నారు వైద్య నిపుణులు. ఆ ఆహార పదార్ధాలేవో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 28, 2022, 04:42 PM IST
Kidney Stone Patients: మీ కిడ్నీల్లో రాళ్లున్నాయా..అయితే ఈ ఆహార పదార్ధాలు పూర్తిగా మానేయాల్సిందే

Kidney Stone Patients: మీ కిడ్నీలో రాళ్లున్నాయా..అయితే ఈ పదార్ధాలు మీకు విషంతో సమానమే మరి. వెంటనే ఇవాళే మీ డైట్ నుంచి ఈ ఆహారపదార్ధాల్ని తొలగించమంటున్నారు వైద్య నిపుణులు. ఆ ఆహార పదార్ధాలేవో చూద్దాం.

కిడ్ని సమస్య అనేది ప్రస్తుతం సర్వ సాధారణం. రోజువారీ ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీలో రాళ్లుండటమనేది నిత్యం ఎదురవుతోంది. అయితే కొన్ని రకాల ఆహారపదార్ధాలు కిడ్నీలో రాళ్లుండేవారికి విషంతో సమానమంటున్నారు వైద్య నిపుణులు. అందుకే పాలకూర, ఉప్పుు, టొమాటో వంటివి పూర్తిగా డైట్ నుంచి దూరం చేయాల్సిందే. గతంలో మీకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నా..ఈ ఆహార పదార్ధాల్ని డైట్ నుంచి తొలగించాలి. లేకపోతే మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ప్రస్తుత తరుణంలో కిడ్నీలో రాళ్లనేది ప్రధాన సమస్యగా మారింది. లైఫ్‌స్టైల్‌లో మార్పుల కారణంగా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ రోగం వచ్చినప్పుడు అతి భయంకరమైన నొప్పి ఉంటుంది. తెలిసో తెలియకో మనం తినే కొన్ని పదార్ధాల కారణంగా ఆ సమస్య మరింత పెరగవచ్చు. 

కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు..పాలకూరను పూర్తిగా దూరం పెట్టాల్సిందే. పాలకూరలో ఉండే ఆక్సలేట్..కాల్షియంను డిపాజిట్ చేస్తుంది. యూరిన్ ఫ్రీగా అవనివ్వదు. అందుకే కిడ్నీ సమస్య ఉన్నప్పుడు పాలకూర మానేయడం అత్యుత్తమ మార్గం. లేకపోతే సమస్యలు పెరుగుతాయి. చాకొలేట్లు కూడా ఈ రోగులకు మంచివి కావు. చాకొలేట్స్ తినడం వల్ల కిడ్నీ సైజ్ పెరగవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా ఆక్సలేట్ ఉంటుంది. అందుకే కిడ్నీలో రాళ్లున్నవారు చాకొలేట్లు మానేయాల్సి వస్తుంది. ఇక టొమాటో కూడా కిడ్నీలో రాళ్లుండే రోగులకు విషంతో సమానం. టొమాటోలో పుష్కలంగా లభించే ఆక్సిలేట్ కారణంగా కాల్షియం పరిమాణం పెరిగిపోతుంది. ఇది కిడ్నీ రోగులకు ఏ మాత్రం మంచిది కాదు. అందుకే టొమాటోను దూరంగా పెట్టాలి. ఒకవేళ తప్పదనుకుంటే..టొమాటోలో గింజలు తొలగించి తీసుకుంటే మంచిది. 

Also read: Vitamins Deficiency: శరీరంలో ఏ విటమిన్లు లోపిస్తే..ఏయే లక్షణాలు కన్పిస్తాయో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News