Navratri 2020: నవరాత్రి సమయంలో తీసుకోవాల్సిన 5 సాత్విక పానీయాలు
Sattvic Drinks | దేవీ నవరాత్రుల ( Navratri ) సమయంలో చాలా మంది ఉపవాస దీక్ష ( Fasting ) తీసుకుంటారు. అయితే ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ సమయంలో ఎలాంటి భోజనం చేయాలి.. ఎలాంటి పానీయాలు తీసుకోవాలి అనే విషయంలో మాత్రం చాలా మంది ఆలోచనలో పడిపోతారు. అలాంటి వారికి ఈ టిప్స్.
Drinks During Navratri| దేవీ నవరాత్రుల ( Navratri ) సమయంలో చాలా మంది ఉపవాస దీక్ష ( Fasting ) తీసుకుంటారు. అయితే ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ సమయంలో ఎలాంటి భోజనం చేయాలి.. ఎలాంటి పానీయాలు తీసుకోవాలి అనే విషయంలో మాత్రం చాలా మంది ఆలోచనలో పడిపోతారు. అలాంటి వారికి ఈ టిప్స్. READ ALSO: Navratri 2020 Fasting Tips: నవరాత్రిలో ఉపవాసం చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి
పిత్తాన్ని బ్యాలెన్స్ చేసే టీ
పిత్త దోషాలు రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి అని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల అజీర్తి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. పిత్త దోషాలు తగ్గాలి అంటే సోంపు, జీలకర్ర, కొత్తిమీర ఆకులు, గులాబీ రేకులను నీటిలో వేసి 5 నిమిషాలు మరగబెట్టాలి. ఈ డ్రింక్ ప్రతీ రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
కధా టీ | Kadha Tea
కరోనావైరస్ (Coronavirus) కాలంలో చాలా మంది కధా టీ తీసుకుంటున్నారు. దీనిని తయారుచేయడానికి అల్లం, దాల్చిని, తులసి, పసుపు, నల్ల మిరియాలు, కిష్మిష్ కావాలి. వేడి నీటిలో మరిగించి తరచూ తీసుకోవాలి.
త్రిఫల రసం | Triphala Juice
త్రిఫల రసంలో విటమిన్ సీ, గాలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనిని తీసుకోవాడం వల్ల రోగ నిరోధక శక్తి ( Immunity ) పెరుగుతుంది.
అల్లం-తులసీ టీ | Ginger-Basil Tea
ఆయుర్వేదంలో అల్లం, తులసీని అద్భుతమైన పదార్థాలుగా వర్ణించారు. శరీరాన్ని వ్యాధులను తట్టుకునే విధంగా ఇది తయారుచేస్తుంది. దాంతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కాపాడుతుంది. టీ చేసే సమయంలో ఒక అల్లం ముక్క, కొన్ని తులసీ ఆకులను వేసుకుంటే చాలు.
పసుపు పాలు | Turmeric Tea
పసుపు కలిపి పాల వల్ల అనారోగ్యాలు దూరం అవుతాయి. దాంతో పాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇలా మరెన్నో ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి. ఈ మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న విషతుల్యాలు తొలగిపోతాయి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR