Natural Remedies To Reduce Insomnia: నిద్రలేమి సమస్య నుంచి బయట పడడానికి చాలామంది మందులను వాడుతూ ఉంటారు. దీని కారణంగా శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే మన జీవనశైలిలో పలు మార్పులతో పాటు కొన్ని న్యాచురల్ టిప్స్‌ను పాటిస్తే ఈ సమస్య తగ్గుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు పాదాలకు ఆయిల్‌తో మసాజ్‌ చేసుకోవాలి. దీని కోసం పాదాలను శుభ్రంగా కడగాలి.  తరువాత గోరు వెచ్చని నూనెతో మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాల రక్తప్రసరణ పెరిగి చక్కగా నిద్రపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల నిద్రబాగా పడుతుంది.


ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలల్లో పసుపును కలిపి తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పసుపులో ఎన్నో విలువైన గుణాలు ఉంటాయి. ముఖ్యంగా కర్కుమిన్ అనే పదార్ధం శరీర ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. 


నిద్రలేమి సమస్యకు ఆయుర్వేవద మూలికలు ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా అశ్వగంధ పొడిని ఈ సమస్యకు ఎంతో ఉపయోగపడుతుంది. గోరు వెచ్చటి పాలల్లో ఈ ఆశ్వగంధ పొడిని తీసుకోవడం వల్ల  మంచి నిద్ర పడుతుంది.


అంతేకాకుండా సుఖమైన నిద్ర కోసం గోరు వెచ్చటి నీటిలో లావెండర్‌ ఆయిల్‌ ను కలిపి స్నానం చేయడం వల్ల ఈ నిద్రలేమి సమస్య తగ్గుతుందని ఆరోగ్యనిసపుణులు చెబుతున్నారు. అలాగే ప్రశాంతత లభిస్తుంది.


Also Read Tulsi Benefits: తులసి ఆకులు రోజూ తింటే చాలు, ఏ వ్యాధి కూడా దరి చేరదు


ఈ చిట్కాలతో పాటు మన జీవనశైలిలో కూడా పలు మార్పులు చేయడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. నిద్రపోయే ముందు కొంచెం సేపు ధ్యానం చేయడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. అంతేకాకుండా మీ సెల్‌ ఫోన్స్‌, టీవీ ఇతర వస్తువులను ఉపయోగించడం తగ్గించాలి. అలాగే సమయానికి భోజనం చేయం, తేలిక పాటి ఆహార పదార్థాలను తినడం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.


ఆరోగ్య నిపుణులు ప్రకారం చక్కటి నిద్ర అనేది ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. ఈ సమయంలో పడుకోవాడం వల్ల శరీరం ఎంతో ఉత్సాహంగా ఉంటుందని చెబుతున్నారు.  కాబట్టి ఈ టిప్స్‌ను పాటించడం వల్ల  సుఖమైన నిద్రని మీ సొంతం చేసుకోవచ్చు. 


Also Read Mint Coriander Drink: ఈ జ్యుస్‌ తాగడం వల్ల నల్ల మచ్చలు మాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter