Mint Coriander Drink: ఈ జ్యుస్‌ తాగడం వల్ల నల్ల మచ్చలు మాయం!

Mint Coriander Juice Benefits: ప్రస్తుతం ఉన్న జీవనశైలి పోషకహారం పట్ట శ్రద్ధ చూపడంలేదు. బయట లభించే ప్యాకేజీ ఫుడ్స్,  జంక్ ఫుడ్స్ మీద క్కువ చూపిస్తున్నారు నేటి తరం యువత.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2024, 10:53 PM IST
Mint Coriander Drink: ఈ జ్యుస్‌ తాగడం వల్ల నల్ల మచ్చలు మాయం!

Mint Coriander Juice Benefits: నేటి కాలంలో మారిన ఆహార అలవాట్ల కారణంగా  తరచు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలు, ఊబకాయం, లివర్‌ వ్యాధి ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి మందులను వాడుతున్నారు.  కానీ  దీని వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. అయితే సహజంగా పండిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా పుదీనా,  కొత్తిమీర , తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

మ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేయడంలో  ఈ  పదార్థాలతో తయారు చేసిన జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. 
దీనిని ఎలా తయారు చేసుకోవాలి అంటే:

పుదీనా ఆకులను, కొత్తిమీర‌, తుల‌సి ఆకుల‌ను, నిమ్మ‌కాయ‌ను తీసుకోవాల్సి ఉంటుంది. పుదీనాను, కొత్తిమీర‌ను, తుల‌సి ఆకుల‌ను శుభ్రంగా క‌డగాలి. త‌రువాత ఒక జార్ లో తుల‌సి ఆకులు, త‌రిగిన పుదీనా, కొత్తిమీరతో పాటు ఒక గ్లాస్ నీటిని కూడా పోయాలి.  ఈ ఆకుల‌ను మెత్త‌గా జ్యూస్ చేసుకోవాలి.

త‌రువాత ఈ జ్యూస్ ను  ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. జ్యూస్ లో ఒక నిమ్మకాయ పూర్తి ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న రోజుకు ఒక గ్లాస్ చొప్పున తాగాలి. ఈ విధంగా జ్యూస్ ను తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా బరువు సమస్య నుంచి బయట పడటంతో ఏంతో మేలు చేస్తుంది.

Also Read Sharing Soap: సోప్‌ విషయంలో ఈ జాగ్రత్తలు చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు!

చర్మ పై ఎలాంటి నల్ల మచ్చలు రాకుండా ఈ జ్యుస్‌ సహాయపడుతుంది. ఈ జ్యుస్‌ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.ఈ విధంగా  కొత్తిమీర‌, పుదీనా, తుల‌సి ఆకుల‌తో చేసిన జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

Also Read Appetite Boosting Foods: పిల్లల్లో ఆకలి కలిగించే ఆహార పదార్ధాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News