Food to Boost Immunity: ప్రస్తుతం ఉన్న కరోనా కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.. మాంచి ఆహారం తీసుపోకోవటం వలన రోగనిరోధక వ్యవస్థ యొక్క శక్తిని పెంచుకొని, కరోనా భారీ నుండి బయట పడవచ్చు. ఈ ఆహార పదార్థాలతో మీరు మీ కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆహారం తీసుకునే మీ రోగనిరోధక శక్తి పటిష్టంగా మారుతుంది 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్పాహారం
రోజు తినే భోజనాలలో ఇది చాలా ముఖ్యమైనది మరియు తదనుగుణంగా శ్రద్ధ చూపించాలి. అల్పాహారంలో ఉండే ఆహార సమూహాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుటలో సహాయపడతాయి. ఒకవేళ అల్పాహారం తినని ఎడల, శరీర సమతుల్యత దెబ్బ తినే అవకాశం ఉంది. పోషకాహారాలను దట్టంగా కలిగిన ఆహర పదార్థాలు అల్పాహారంలో ఉండేలా చూసుకోండి. 


Also Read: IPL 2021: అఫ్గాన్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!


ఆరోగ్యకర స్నాక్స్
ఆరోగ్యంగా ఉండటంలో స్నాక్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఫ్రిజ్ లో కనపడినది తినకూడదు. ఆరోగ్యాన్ని పెంపొందించే ఆపిల్, క్యారెట్, సలాడ్ లేదా హోల్ గ్రైన్స్ క్రాకర్స్ వంటి వాటిని ఎల్లపుడు అందుబాటులో ఉండేలా చూసుకోండి. అనారోగ్యకర స్నాక్స్ లను తినటం వలన శరీరంలో కొవ్వు పదార్థాల చేరిక అధికమై, చాలా రకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. పండ్లు, కూరగాయల వంటి స్నాక్స్ లను ఫ్రిజ్ లో ఉండేలా చూసుకోండి.


భోజనాల తయారీ
భోజనాలు కూడా ఆరోగ్యమైన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవటం మరొక విషయం. భోజనాలను తయారు చేసే సమయంలో ఆకుకూరలు, హోల్ గ్రైన్స్, కొవ్వు అధికంగా లేని ఆహరాలు లేదా తక్కువ కొవ్వులను కలిగిన పాల ఉత్పత్తులను మరియు లీన్ ప్రోటీన్ ఆహారాలతో కూడిన వాటిని ఉంచుకోవటం చాలా మంచిది. భోజనంలో అన్ని రకాల ఆహారాలు ఉండేలా చూసుకోండి. అన్ని రకాల ఆహార పదార్థాల నుండి మాత్రమే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందించబడతాయి.


Also Read: IPL 2021: అఫ్గాన్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!


పండ్లు మరియు కూరగాయలు
పండ్లు మరియు కూరగాయలు అధిక మొత్తంలో పోషకాలను మరియు తక్కువ స్థాయిలో క్యాలోరీలను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని నిరంతరాయంగా అందించటమే కాకుండా, పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. అధిక క్యాలోరీలను అందించే వాటికి బదులుగా, క్యాలోరీలు తక్కువ అందించే ఆహారాలను తినటం వలన అధిక మొత్తంలో తినటం మాత్రమే కాకుండా, బరువుపై ఎలాంటి ప్రభావం చూపబడదు. కావున వివిధ రంగు గల పండ్లు మరియు కూరగాయలను తినండి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook