Food Help to Control Sugar: రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈరోజు ఎండకాలం షుగర్ వ్యాధిగ్రస్తులు తప్రకుండా తమ డైట్లో చేర్చుకోవాల్సిన ఆహారాలు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెర్రీ..
బెర్రీల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను, కార్బొహైడ్రేట్స్‌ను నెమ్మదిగా  గ్రహిస్తాయి. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాదు బెర్రీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ సూచి తక్కువగా ఉంటుంది. ఇవి షుగర్ లెవల్‌ ను అంతగా ప్రభావితం చేయవు.


ఆకుకూరలు..
ఆకుకూరల్లో కూడా కార్బొహైడ్రేట్లు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. దీంతో బ్లడ్‌ షుగర్‌ నియంత్రణలో ఉంటాయి.


టమాటా..
టమాటాల్లో లైకోపిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌ ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఇందులో కూడా జీఐ లెవల్స్ తక్కువగా ఉంటాయి. విటమిన్ సీ,కే ఆరోగ్యానికి ఎంతో మంచిది.


అవకాడో..
అవకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్, పొటాషియం కూడా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి. అవకాడో తింటే ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. 


కీర..
కీరలో కార్బొహైడ్రేట్లు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో నీటి శాతం, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఎండకాలం వీటిని తీసుకోవడం వల్ల డీహైడ్రేట్‌ కాకుండా ఉండొచ్చు. ఫైబర్ గుణాలు కార్బొహైడ్రేట్లను మెల్లిగా జీర్ణం చేస్తాయి.


జుకినీ..
జుకినీలో కార్బొహైడ్రేట్లు, కేలరీలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పాస్తా, రైస్‌లో వీటిని వేసుకుని తినవచ్చు. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.బరువు నిర్వహణను ప్రేరేపిస్తాయి.


ఇదీ చదవండి: కడుపులో అజీర్తి చేసిందా? మీ వంటింట్లోనే ఉంది అసలైన మందు..


బెల్ పెప్పర్..
బెల్ పెప్పర్‌లో కార్బొహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బెల్‌ పెప్పర్స్ ఇన్సూలిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది బ్లడ్‌ షుగర్ ఫ్రెండ్లీ డైట్.


పుచ్చకాయ..
పుచ్చకాయ రుచి తీయగా ఉంటుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పుచ్చకాయ డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది.


సమ్మర్‌ స్క్వాష్..
సమ్మర్ స్వ్కాష్ వెరైటీల్లో కార్బొహైడ్రేట్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ మీల్స్.


ఇదీ చదవండి: తాటిముంజలతో మహాబలం.. తెలిస్తే ఇక అస్సలు వదలరు..


గ్రీన్ పీ..
గ్రీన్ పీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. గ్రీన్ పీ డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter


Ice Apple Benefitsice appleIce Apple Health Benefits