Cumin Seeds for Bloating: కడుపులో అజీర్తి చేసిందా? మీ వంటింట్లోనే ఉంది అసలైన మందు..

Cumin Seeds for Bloating:  కడుపులో అజీర్తి అసౌకర్యం సమస్యలు చాలా ఇబ్బందికరంగా మారుతాయి. దీన్ని తక్కువ అంచనవేస్తే ప్రాణాపాయ స్థితి కూడా చేరుకుంటుంది. అయితే కడుపులో అజీర్తి, అసౌకర్యంతో బాధపడితే దానికి వండింట్లోనే మంచి రెమిడీ ఉంది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 11, 2024, 08:24 AM IST
Cumin Seeds for Bloating: కడుపులో అజీర్తి చేసిందా? మీ వంటింట్లోనే ఉంది అసలైన మందు..

Cumin Seeds for Bloating:  కడుపులో అజీర్తి అసౌకర్యం సమస్యలు చాలా ఇబ్బందికరంగా మారుతాయి. దీన్ని తక్కువ అంచనవేస్తే ప్రాణాపాయ స్థితి కూడా చేరుకుంటుంది. అయితే కడుపులో అజీర్తి, అసౌకర్యంతో బాధపడితే దానికి వండింట్లోనే మంచి రెమిడీ ఉంది.

జీలకర్ర..
జీలకర్ర ప్రతిరోజూ మన వంటల్లో వినియోగిస్తాం. ఇందులో కడుపు సమస్యలను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది జీర్ణ ఆరోగ్యం, బరువు నిర్వహణకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీలకర్రలో విటమిన్స్, మినరల్స్ అయిన ఐరన్, కాల్షియం, మెగ్నిషియం ఇది వివిధ శరీరక క్రియలకు కూడా అవసరం.

జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాలు..
జీలకర్రలో మంచి డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచి పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జీలకర్రలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు ఉంటాయి. ఇది ఇమ్యూన్‌ వ్యవస్థకు మంచిది. కడుపులో అసౌకర్యం, అజీర్తికి కూడా చెక్‌ పెడుతుంది జీలకర్ర.

జీలకర్ర టీ..
జీలకర్ర టీ ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది. జీలకర్ర టీ తీసుకోవడం వల్ల మెటబాలిక్‌ ఆరోగ్యం సహజసిద్ధంగా మెరుగవుతుంది.
ఈ టీని తయారు చేసుకోవడానికి రెండు కప్పుల నీటిని వేడి చేసుకోవాలి.  అందులో ఓ స్పూన్ జీలకర్ర వేసి ఓ పది నిమిషాలపాటు మరిగించుకోవాలి. ఆ తర్వాత వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా అల్లం లేదా నిమ్మరసం వేసుకుని తాగాలి.

ఇదీ చదవండి: ఈ 4 మూలికలు వేసవిలో శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతాయి..

జీలకర్ర నీరు..
రాత్రి పడుకునే సమయంలో ఓ గ్లాసు నీటిలో ఓ చెంచా జీలకర్రను వేసి నానబెట్టాలి. దీన్ని పరగడుపున తీసుకుంటే కడుపు సమస్యలకు చెక్ పెడుతుంది. ఇది కడుపులో అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.

జీలకర్ర పొడి..
ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్రను పొడి చేసుకోవాలి. అందులో కళ్లు ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసుకుని తీసుకోవాలి. ఇది కూడా అజీర్తి సమస్యకు బెస్ట్‌ రెమిడీ.

డిటాక్స్ వాటర్..
ఈ డిటాక్స్ వాటర్ తయారు చేసుకోవడనాఇకి జీలకర్ర, మిరియాలు, అల్లం వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత వడకట్టుకుని తేనె వేసుకుని తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత తీసుకుంటే కడుపు సమస్యలకు ఫాస్ట్‌ రిలీఫ్ ఇస్తుంది.

ఇదీ చదవండి:  తాటిముంజలతో మహాబలం.. తెలిస్తే ఇక అస్సలు వదలరు..

వేయించిన జీలకర్ర పొడిని సలాడ్స్, సూప్స్, ఇతర కూరల్లో కూడా వేసుకుని తీసుకోవచ్చు. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ప్యాన్ లో వేసుకుని జీలకర్ర వేసి వేయించాలి. అప్పుడు ఇన్ఫూస్డ్‌  ఆయిల్ తయారవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News