Foods to Avoid: ఆధునిక జీవన విధానంలో నైట్‌షిఫ్ట్ ఉద్యోగమనేది సర్వ సాధారణంగా మారిపోయింది. వేళ కాని వేళల్లో తినే ఆహారపదార్ధాలు  అనారోగ్యానికి కారణమవుతున్నాయి. రాత్రి వేళల్లో ఏ ఆహారపదార్ధాలు తినకూడదో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడు చేసే పనిని అప్పుడే చేయాలంటారు పెద్దలు. అది తిండైనా లేదా పనైనా. అయితే ఆధునిక జీవనశైలి (Modern Lifestyle) తెచ్చిన మార్పులతో నైట్‌షిఫ్ట్ సర్వ సాధారణంగా మారిపోయింది. ఈ నేపధ్యంలో రాత్రివేళల్లో పనిచేసేటప్పుడు టైమ్ పాస్ కావచ్చు లేదా నిద్ర లేకపోవడం వల్ల కలిగే ఆకలితో కావచ్చు వివిధ రకాల చిరుతిళ్లు, ఆహారపదార్ధాలు తింటుంటాం. ఇలాంటి వాటి వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు (Heart Diseases) తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట తినడం మంచిది కాదని..ఏది తిన్నా సరే..పగటి పూటే తినాలంటున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తీసుకోవల్సి వస్తే..బిస్కెట్స్, చిప్స్, హాట్ లేదా స్వీట్స్ వంటి చిరు తిళ్లు అస్సలు తీసుకోవద్దంటున్నారు. లైట్ లిక్విడ్స్ 1-2 సార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలంటున్నారు. 


ఈ విషయంపై అమెరికాలోని National Heart, Lung and Blood Institute సైంటిస్టులు పరిశోధనలు చేశారు. ఆరోగ్యంగా ఉన్న 12 మంది మగవారిని, ఏడుగురు ఆడవారిని ఎంచుకున్నారు. వీరందరికీ ఒక నెల రోజుల పాటు వేర్వేరు వేళల్లో ఆహారం అందించారు. దాంతో వారి జీవన శైలి పూర్తిగా మారింది. జీవగడియారంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రి పూట తిండి (Night Foods) తీసుకున్నవారి శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగాయని శాస్త్రవేత్తలు గమనించారు. అందుకే  వేళ కాని వేళల్లో ఆహారం తీసుకోవడం మంచిది కాదంటున్నారు వైద్యులు. రాత్రి వేళల్లో చిరు తిళ్లు, ఆయిల్ ఫుడ్స్, చిప్స్, పిజ్జాలు, బిస్కెట్స్ , నూడిల్స్ వంటివి తీసుకుంటే గుండె సంబంధిత, మధుమేహం (Diabetes) వ్యాధులు పొంచి ఉంటాయని అంటున్నారు. 


Also read: Wine and Health: ఆ వైన్ తాగితే గుండె సమస్య దూరమైపోతుందిట..ఇవీ వివరాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.