Summer Foods: వేసవిలో ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు ఒంట్లో వేడి మొత్తం మాయం..
Healthy Food In Summer Season: వేసవికాలంలో ఎండల కారణంగా శరీరం డీహైడ్రేష్ బారిన పడుతుంది. ఎండల నుంచి మనం మన ఆరోగ్యాని కాపాడుకోవాలి అంటే బలమైన ఆహారపదార్థలను తీసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో తీసుకోవాల్సిన ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
Healthy Food In Summer Season: వేసవికాలంలో తీసుకోవాల్సిన ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో శరీరాని చల్లగా ఉంచే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో జీర్ణవ్యవస్థను మెరుగుగా ఉంచుకోవడనికి ప్రోబయోటిక్స్ , కూలింగ్ ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
వేసవిలో దాల్-చావల్, పెరుగు, రాగి జావ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. శరీరం చల్లగా ఉంటుంది. మజ్జిగ, సత్తు, కొబ్బరి, నీరు తీసుకోవడం వల్ల రిఫ్రెష్‌గా ఉంటారు. వేసవికాలంలో అధిక వేడి కారణంగా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి నివారించడంలో సహాయపడుతుంది.
అయితే వేసవికాలంలో కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఎండల బారిన పడకుండా ఉంటారు. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం లేదు.
పెరుగు అన్నం:
వేసవి కాలంలో మీ జీర్ణావ్యవస్థ మెరుగుపడాలి అంటే ప్రతిరోజు పెరుగు అన్నం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రోబయోటిక్స్, గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలకు అవసరమైన కాల్షియం, ప్రోటీన్ యొక్క మంచి మూలాన్ని అందిస్తుంది. ప్రేగులను చల్లగా ఉంచుతాయి.
మొలకెత్తిన సలాడ్:
మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వేసవికాలంలో వీటిని తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్, ఎంజైమ్‌లు, విటమిన్లు , మినరల్స్ శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. ఇవి జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కాల్షియం, ప్రోటీన్ గుణాలు లభించడం వల్ల మీ ఎముకలు, కండరాలను దృఢంగా తయారు చేస్తాయి.
Also Read Maida Flour: మైదా పిండిని ఎలా తయారు చేస్తారో తెలుసా? దీన్ని అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది
యాష్ పొట్లకాయ జ్యూస్:
యాష్ పొట్లకాయ జ్యూస్ వేసవిలో ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడిని తొలగిస్తుంది. దీని వల్ల మీరు ఎల్లప్పుడు హైడ్రేట్ గా, రిఫ్రెష్ గా ఉంటారు. అంతేకాకుండా యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం, అజీర్ణం వంటి గట్ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది.
మజ్జిగ:
వేసవికాలంలో మజ్జిగ చక్కటి ఆహారం. దీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఉబ్బరం,మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి తగ్గిస్తుంది. మజ్జిగలో కొవ్వు, కాల్షియం,పొటాషియం, విటమిన్ బి-12 , మినరల్స్ అధికంగా ఉంటాయి. మీ ప్రేగులను చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంలోఇది ఒక గొప్ప పదార్థం అని చెప్పవచ్చు.
Also Read Ragi Dibba Rotte: రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter