Foods for Blood Circulation: శరీరంలో రక్త సరఫరాను పెంచే 6 ఆహారాలు ఇవే..
Foods for Blood Circulation: మన శరీరంలో రక్త సరఫరా కీలకపాత్ర పోషిస్తుంది. బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.రక్తం మన శరీరంలో ఖనిజాలను, ఆక్సిజన్‌లను ఇతర అవయవాలకు రవాణా చేస్తాయి.
Foods for Blood Circulation: మన శరీరంలో రక్త సరఫరా కీలకపాత్ర పోషిస్తుంది. బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.రక్తం మన శరీరంలో ఖనిజాలను, ఆక్సిజన్‌లను ఇతర అవయవాలకు రవాణా చేస్తాయి. బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగ్గా ఉండాలంటే మంచి జీవనశైలి ముఖ్యం. మీకు బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా లేకపోతే కొన్ని ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
బీట్ రూట్స్..
కొన్ని నివేదికల ప్రకారం నైట్రేట్ పుష్కలంగా ఉండే రూట్ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి. ఇది నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో సహజసిద్ధంగా రక్తనాళాలను వదులుగా చేస్తాయి. దీంతో రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.
బెర్రీ..
కొన్ని రకాల బెర్రీ పండ్లను డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యగా స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీలను డైట్లో చేర్చుకోండి ఎంతో ఆరోగ్యకరం. బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తసరఫరాకు సహాయపడతాయి. ఇందులో ఉండే ఆంథోసైనిన్స్ అర్టెరీ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
దానిమ్మ..
దానిమ్మ మన శరీరంలో రక్తాన్ని బూస్ట్ చేస్తుంది. ఇది మెరుగైన రక్తసరఫరాకు తోడ్పడుతుంది. దానిమ్మలో పాలీఫెనల్స్ యాంటీ ఆక్సిడెంట్, నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసం తాగడం వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగవుతుంది. ఇది కండరాలు డ్యామేజ్ అవ్వకుండా వాపు సమస్యలు రాకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి: పాలతో పాటు ఈ ఫుడ్స్ తినకూడదు.. అవి ఏంటో తెలుసా?
ఆనియన్స్..
ఉల్లిపాయలు కూడా రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రక్త నాళాలు, కణాల్లో బ్లడ్ సర్క్యూలేషన్‌ను పెంచుతాయి.
వెల్లుల్లి..
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సల్ఫర్ కంపౌండ్ ఉంటుంది. ఇది రక్త నాళాలకు ఉపశమనాన్ని అందిస్తాయి. తరచూ వెల్లుల్లిని డైట్లో చేర్చుకున్నవారికి రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ పెరగకుండా కాపాడుతుంది.
ఇదీ చదవండి: కడుపులో గ్యాస్ పెయిన్ భరించలేకపోతున్నారా? ఈ డ్రింక్ తాగితే వెంటనే ఉపశమనం..
ఫ్యాటీ ఫిష్..
ఫ్యాటీ ఫిష్ అనే సాల్మాన్, మాకెరల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంచుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాటీ ఫిష్‌లో ఉంటాయి ఇది నైట్రిక్ ఆక్సైడ్ విడుదలవ్వడానికి ప్రేరేపిస్తుంది. ఇది రక్తంలో కలిసి రక్తసరఫరాను పెంచుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter