Gastric problem Remedy: కడుపులో ఈ విధంగా గ్యాస్ ఏర్పడటానికి ప్రధాన కారణం వేయించిన లేదా స్పైసి ఫుడ్ తీసుకోవడం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వీటి వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.
Gastric problem Remedy: మన ఆరోగ్యశైలి సరిగ్గా నిర్వహించకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మన కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు, వాటి కణాలు పేగులలోనే ఉండిపోయినప్పుడు కిణ్వ ప్రక్రియ జరగడం ప్రారంభమవుతుంది. దీంతో గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల కడుపులో నొప్పి మొదలవుతుంది.
కడుపునొప్పి సమస్యలకు ఇంట్లోనే తయారు చేసుకునే ఎన్నో రకాల చిట్కాలు ఉన్నాయి. దీంతో కడుపునొప్పి సహజసిద్ధంగా తగ్గిపోతుంది. ఇంట్లో ఉండే జిలకర్రతో ఈ పానియాన్ని తయారు చేసుకోవాలి. దీంతో తక్షణ రిలీఫ్ లభిస్తుంది. ఒకవేళ మీకు కడుపు నొప్పికి కారణం గ్యాస్ ఏర్పడితే ఈ పానీయం తాగండి.
మీరు తరచుగా గ్యాస్ ఏర్పడే సమస్యతో బాధపడుతుంటే, ఈ ఆహారాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. వీటి వల్ల కడుపులో గ్యాస్ సమస్య మరింత ఎక్కువవుతుంది. వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలు, పప్పులు, ముల్లంగి, గింజలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
కొన్ని ఆహారాలు తింటే గ్యాస్ ఏర్పడే సమస్య ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాటిని నివారించండి. గ్యాస్ట్రిక్ కడుపునొప్పితో బాధపడుతుంటే ఈ డ్రింక్ తాగడం వల్ల తక్కువ సమయంలో ఉపశమనం లభిస్తుంది. ఈ పానీయం ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
కావాల్సిన పదార్థాలు.. నీళ్లు - కప్పు జీలకర్ర- 1tbsp సోంపు -1tbsp యాలకులు-4
పానియం తయారు చేసే విధానం.. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు నీళ్లు పోయాలి. అందులోనే యాలకులు తొక్క తీసి వేయాలి. సన్నని మంటపై మరిగించుకోవాలి. అందులోనే జిలకర్ర, సోంపు కూడా వేసి మరిగించుకోవాలి. నీరు రంగు మారడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వడకట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.