Foods To Avoid While Having Tea: ఛాయతో కలిపి స్నాక్స్ తినే అలవాటు చాలామందిలో ఉంటుంది. లేదంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినే సమయంలోనూ ఛాయ్ తాగుతుంటారు. కానీ కొన్నిరకాల ఫుడ్స్ ఛాయతో కలిపి తీసుకుంటే అవి ఇబ్బందులకు గురిచేస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు. టీతో కలిపి తినేటప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ ఎంతో రుచిగా ఉంటాయి కానీ అది తెలియకుండానే అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. ఇంతకీ ఛాయతో కలిపి తినకూడని ఆ స్నాక్స్ ఏంటో తెలుసుకుందాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంతమందికి ఛాయలో ఎక్కువ పంచధార కలిపి తియ్యగా తాగే అలవాటు ఉంటుంది. లేదంటే ఇంకొంతమందికి ఛాయతో పాటే స్వీట్స్ కూడా తినే అలవాటు ఉంటుంది. కానీ ఛాయతో పాటే అధిక మోతాదులో చక్కర తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.


పసుపుతో చేసిన ఆహార పదార్థాలను ఛాయతో కలిపి తీసుకోవద్దు. ఎందుకంటే పసుపులో ఒంటికి మేలు చేసే కర్‌క్యూమిన్ అనే రసాయనం ఉంటుంది. ఆ కర్‌క్యూమిన్ ఒంటికి చెందకుండా ఛాయ్ అడ్డుకుంటుంది. 


ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఛాయతో కలిపి ఏకకాలంలో తినవద్దు. ఎందుకంటే ఛాయకు రంగు, రుచి, చిక్కదనం ఇచ్చే టానిన్స్ అనే మూలకం ఉంటుంది. ఇది మీరు తినే ఆహార పదార్థాలలో ఉన్న ఐరన్‌ని శరీరానికి గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా మీరు తీసుకున్న ఆహారం ఒంటికి చెందకుండా నిరూపయోగం అవుతుంది.


కొంతమందికి కోల్డ్ టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇది అందరి ఆరోగ్యానికి సరిపోదు. కోల్డ్ టీ తాగడం వల్ల కడుపులో కండరాలు పట్టేసినట్టు అవుతుంది. ఇది పొట్టలో అనారోగ్యానికి దారితీస్తుంది. 


మసాలాలు అధిక మోతాదులో ఉన్న స్పైసీ ఫుడ్స్ ఛాయతో కలిపి తీసుకుంటే అవి మీ జీర్ణ శక్తిపై ప్రభావం చూపిస్తాయి. ద్రవ పదార్థం అయినా లేదా ఘన పదార్థం అయినా కడుపులోకి పోయిన తరువాత అది జీర్ణం కాకపోతే పొట్టలో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అదే జరిగే ప్రమాదం ఉంటుంది. ఛాయతో కలిపిన పాల పదార్థాలు తీసుకోవద్దు. ముఖ్యంగా పన్నీరు, జున్ను, పెరుగు, యుగర్ట్ వంటివి కలిపిన ఫుడ్స్ అసలే తీసుకోవద్దు. ఇది కూడా చదవండి : Bendi Water Benefits: వావ్.. బెండి వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!


ఇది కూడా చదవండి : Garlic Benefits: వెల్లుల్లి రెబ్బల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.