Bendi Water Benefits: వావ్.. బెండి వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

శరీరానికి అన్ని రకాల పోషకాలను అందించి.. బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించే ఆహార పదార్థాలు కానీ.. ద్రావణాలు కానీ చాలా తక్కువ. కానీ శరీరానికి అన్ని రకాల పోషకాలతో పాటుగా.. బ్లడ్ షుగర్ స్థాయిలను బెండి వాటర్ తగ్గిస్తుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2023, 08:49 PM IST
Bendi Water Benefits: వావ్.. బెండి వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Bendi Water Benefits: ఎవరైనా పోషక విలువలు.. నీళ్ల శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడానికి ప్రాధాన్యం ఇస్తారు.  బెండకాయలలో ఇలాంటి పోషక విలువలను చాలానే కలిగి ఉంది. బెండకాయలను నానబెట్టిన నీళ్లు శరీరంలోని బ్లడ్ షుగర్ నిర్వహణను వహిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.  

బెండకాయలలో శరీరానికి పోషణని అందించే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో ఫైబర్, విటమిన్-బి6 మరియు ఫోలేట్ లాంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. విటమిన్ -బి శరీరంలో డయాబెటిక్ న్యూరోపతి పెరుగుదలను నియంత్రిస్తుంది మరియు శరీరంలో మధుమేహానికి ముఖ్య కారణమైన హోమోసిస్టీన్ స్థాయిని తగ్గిస్తుంది. బెండకాయలో నీళ్ళల్లో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో ఉండే షుగర్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది  

బ్లడ్ షుగర్ నియంత్రణ  
బెండకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే నీటిలో కరిగే మరియు నీటిలో కరగని ఫైబర్ కి మంచి మూలం. దీనివల్ల శరీరంలోని ఫైబర్ మెల్లగా విడిపోతుంది. దీని కారణంగా రక్తంలో షుగర్ నెమ్మదిగా విడుదల అవుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ నియంత్రణ  ఉంటుంది. 

Also Read: Kupwara Encounter: ఎల్వోసీ వెంబడి భారీ ఎన్‌కౌంటర్, 5 మంది ఉగ్రవాదులు హతం

దీంతో పాటుగా బెండకాయ యొక్క గ్లైసెమిక్ఇండెక్స్ తక్కువగా ఉంటుంది మరియు గ్లైసెమిక్ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్థాలు బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. 'అమెరికన్ డయాబేటిస్ అసోసియేషన్' తెలిపిన దాని ప్రకారం.. బెండకాయ నీళ్లు షుగర్ రోగులకు చాలా మంచివని తెలియజేసారు. 

బెండకాయ నీళ్ల తయారీ  
ఆరోగ్య నిపుణులు తెలిపిన దాని ప్రకారం..  బెండకాయ నీళ్లు శరీరంలో షుగర్ లెవల్స్ ని నియంత్రిస్తాయి. బెండకాయ నీళ్ల తయారీకి 5-6 బెండకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి..  మధ్యలోకి రెండు భాగాలుగా కోసి ఒక జార్ లో వాటిని వేసి నీళ్లు పోసి రాత్రి అంత నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే బెండకాయలలో నీళ్లు అన్ని పోయేలా పిండి తీసేయాలి. మిగిలిన నీళ్లను తాగడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది.

Also Read: Chandrababu Case: బెయిల్ కోసం మరో ప్రయత్నం, కేటరాక్ట్ చేయాలంటూ చంద్రబాబు పిటీషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

 

Trending News