Full Body Pain Reason: తరుచుగా శరీర నొప్పులతో బాధపడుతున్నారా.. ఇలా చేయండి.!
Full Body Pain Reason: ప్రస్తుతం చాలా మందిలో శరీర నొప్పుల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పాదాలు, చేతులు, నడుము, భుజాలు, మెడలో నొప్పుల వల్ల వైద్యులను సంప్రదిస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి.
Full Body Pain Reason: ప్రస్తుతం చాలా మందిలో శరీర నొప్పుల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పాదాలు, చేతులు, నడుము, భుజాలు, మెడలో నొప్పుల వల్ల వైద్యులను సంప్రదిస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి. అయితే చాలా మందిలో బాడీ మొత్తం నొప్పులు రావడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ సమస్యలు రావడానికి ముఖ్య కారణాలేంటని చాలా మందికి తెలియదు..!. శరీర నొప్పుల నుంచి ఉపశమనం పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
వీటి కారణంగానే శరీరం అంతటా నొప్పి:
ఒత్తిడి:
ఒత్తిడిని కారణంగా కూడా శరీరంలో నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒత్తిడికి లోనవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి, కండరాలు దృఢంగా తయారవుతాయి. దీనితో పాటు.. శరీరం మంట, ఇన్ఫెక్ష వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
డీహైడ్రేషన్:
డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు లేకపోవడం. ఏ వ్యక్తి అయినా సక్రమంగా పనిచేయాలంటే హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు శరీరమంతా నొప్పి అనుభూతిని కలిగి ఉంటుంది.
నిద్ర లేకపోవడం:
ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం. నిద్రలో ఎదైనా సమస్యలు వస్తే.. శరీరమంతా నొప్పి ప్రారంభమవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో అలసట ఏర్పడి. కావున తప్పనిసరిగా రోజులో 8 గంటల నిద్ర పోవడం మంచిదని నిపుణులు పేర్కొన్నారు.
శరీర నొప్పులకు చికిత్స:
1. శరీరమంత నొప్పిగా ఉంటే.. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది కండరాలు, శరీరం యొక్క ఉద్రిక్తతను తగ్గించి శరీర నొప్పిల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
2. శరీర నొప్పిని తగ్గించుకోవడానికి మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
3. శరీరంలో అధికంగా నొప్పులు ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Tulsi Tea Benefits: తులసి టీ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
Also Read: Juices For Diabetes Patients: మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రిక్స్ ట్రై చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook