Full Day Meal Plan For Weight Loss: ప్రస్తుతం చాలా మంది శరీర బరువు పెరగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్య బారిన పడే చాలా మందిలో యువతే ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువు పెరగడం కారణంగా గుండెపోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల డైట్స్‌ను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది కీటో డైట్‌ను వినియోగిస్తున్నారు. దీనికి బదులుగా ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఈ డైట్‌ను వినియోగించండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజు ఇలా ఆహారాలు తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు:
ఉదయం అల్పాహారంలో ఇవి తప్పనిసరి:

ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గే క్రమంలో చాలా రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం మానుకుని ప్రతి రోజు ఉదయం ఒక కప్పు గ్రీన్‌ టీని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీలో ఉండే చాలా రకాల ఔషధ గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతి రోజు బ్రౌన్‌ బ్రెడ్‌ తీసుకోవడం వల్ల కూడా సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


 ఉదయం 10 గంటలకు ఈ స్నాక్స్‌ తీసుకోండి:
బరువు తగ్గే క్రమంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో మళ్లీ రెండు అరటి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఒక ఉడకబెట్టిన గుడ్డును, పచ్చి కూరగాయలతో తయారు చేసిన సలాడ్స్‌ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 


Also Read:  Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?


భోజనంలో ఈ ఆహారాలు తప్పనిసరి:
మద్యహ్నం భోజనం చేసే క్రమంలో తప్పకుండా రెండు రొట్టేలతో పాటు, పన్నీర్‌తో తయారు చేసిన కూరను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సాయంత్రం పూట కూడా స్నాక్స్‌ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం కూరగాయలతో తయారు సూప్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆహారంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గడమేకాకుండా సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


రాత్రి భోజనం:
రాత్రి భోజనంలో తప్పకుండా ఒక రోటీని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలను తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది.  ప్రతి రోజు ఈ పద్ధతిలో ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా ఊబకాయం సమస్యలు దూరమవుతాయి.  


Also Read:  Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook