COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Which Dal Causes Most Gas: ఆధునిక జీవనశైలి పాటించే చాలా మందిలో పొట్ట సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా అనారోగ్యకమైవే ఉండడమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది చిన్న వయస్సులతోనే గ్యాస్-ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. వీటి కారణంగా ఎలాంటి పనులు సరిగ్గా చేయలేకపోతున్నారు. అయితే చాలా మందిలో ప్రోటీన్‌ అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా గ్యాస్-ఎసిడిటీ సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రోటీన్స్‌ అధిక పరిమాణంలో లభించే కొన్ని పప్పులను తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



తీవ్ర గ్యాస్‌కు కారణమయ్యే పప్పులు ఇవే:
పెసర పప్పు:

మూంగ్ దాల్ శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటీన్స్‌ లభిస్తాయి. దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులుభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ పప్పును అతిగా తీసుకోవడం వల్ల గ్యాస్‌ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పప్పు తీసుకున్న తర్వాత ఒక గ్లాస్‌ లస్సీని తీసుకోవాల్సి ఉంటుంది. 


బఠానీ:
బఠానీని ప్రతి రోజు తినడం వల్ల కూడా పొట్టలోని గ్యాస్‌ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బఠానీలో కూడా అధిక పరిమాణంలో ప్రోటీన్స్‌ లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల గ్యాస్-ఎసిడిటీ సమస్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతిగా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?


శనగ పప్పు:
శనగ పప్పులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల గ్యాస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పప్పును అతిగా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ పప్పును అతిగా తీసుకోవడం మానుకోవాలి.


బీన్స్:
రాజ్మా పప్పు కూడా శరీరానికి చాలా మంచిది..ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కానీ క్రమం తప్పకుండా తినడం వల్ల గ్యాస్-ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి