COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gastritis Relief At Home: భారతీయులు మసాలతో కూడిన ఆహారాలు అతిగా తింటూ ఉంటారు. దీని కారణంగా పొట్ట సమస్యలైన మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌లో చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు చిట్కాలు పాటించాలి.


ఈ వీటిని తప్పకుండా తీసుకోండి:
కొబ్బరి నీళ్లు:

పొట్టలో గ్యాస్ సమస్యలతొ బాధపడేవారు ప్రతి రోజు కొబ్బరి నీటిని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. 


దోసకాయ:
శరీరాన్ని ఆరోగ్యంగా హైడ్రేట్‌గా ఉంచేందుకు దోసకాయ ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తరచుగా పొట్టలోని గ్యాస్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు సలాడ్స్‌లో దోసకాయను తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!  


లెమన్ వాటర్:
గ్యాస్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు లెమన్‌ వాటర్‌ను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుంగా జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.


అరటిపండ్లు: 
అరటి పండ్లు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పీచు అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేసేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అరటిపండులో ఐరన్, క్యాల్షియం కూడా అధికంగా లభిస్తుంది. దీనిని అల్పాహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి