Giloy Benefits: తిప్ప బెరడు వల్ల చర్మానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
Giloy Benefits: తిప్ప బెరడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, శరీరాభివృద్ధికి దోహదపడుతుంది. ఈ బెరడు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే, ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
Giloy Benefits: తిప్ప బెరడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, శరీరాభివృద్ధికి దోహదపడుతుంది. ఈ బెరడు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే, ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఒత్తిడి తగ్గించి..చర్మ సంరక్షణ కోసం ఉపయోగపడుతుంది. తిప్ప బెరడుతో శరీరానికి వచ్చే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం..
తిప్ప బెరడు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:
చర్మానికి మేలు చేస్తుంది:
తిప్ప బెరడు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా ముడతలను తగ్గిపోయి. చర్మాన్ని మరింత యవ్వనంగా మారేందుకు తోడ్పడుతుంది. చర్మంపై ఉన్న అలర్జీలు, టోన్, మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలను కూడా తిప్ప బెరడు తొలగిస్తుంది.
తిప్ప బెరడు రెట్టింపు ప్రయోజనాలు:
పచ్చి పాలతో తిప్ప బెరడు పోడి :
మంచి స్కిన్ టోన్ కోసం పచ్చి పాలలోతిప్ప బెరడు పొడి మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాలు అలాగే ఉంచి మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
తేనెతో తిప్ప బెరడు పోడి:
తిప్ప బెరడు పొడిలో కొద్దిగా తేనె, రోజ్ వాటర్‌ను అప్లై చేసి పేస్ట్ చేయండి. తర్వాత చర్మంపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.
పసుపుతో తిప్ప బెరడు పోడి:
చర్మంపై దద్దుర్లు, మొటిమల సమస్యలు ఉంటే, తిప్ప బెరడు, పసుపు, కలబంద జెల్‌ను ఒక గిన్నెలో మిక్స్ చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి. ఇది మీ చర్మ రంగును పెంచేందుకు దోహదపడుతుంది
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Mango Protein Shake: మ్యాంగో ప్రొటీన్ షేక్‌తో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
Also Read: High Cholesterol Food: అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఆహారాలను తినకూడదు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి