Mango Protein Shake: వేసవి కాలాన్ని చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే చాలా రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో లభించే పండ్లలో మామిడి పండు ఒక్కటి. అందుకే ఎక్కువ మంది ఎండకాలంలో మామిడి పండ్లను తినేందుకు అసక్తి చూపుతారు. ప్రస్తుతం ఈ పండ్లను తినడమే కాకుండా జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు. అయితే వ్యాయామం, జిమ్ చేసిన తర్వాత కూడా మామిడి జ్యూస్ తాగితే శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయి. మామిడిలో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా శరీర దృఢత్వానికి దోహదపడతాయి. మామిడి షేక్‌లో విటమిన్స్ ఉండడం వల్ల ఇది అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. కావున మామిడి నుంచి ప్రొటీన్ షేక్ తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
ఇంట్లోనే మ్యాంగో ప్రొటీన్ షేక్ ఇలా తయారు చేసుకోండి:
మ్యాంగో ప్రొటీన్ షేక్ చేయడానికి, ముందుగా మామిడి పండును తీసుకుని పొట్టు తీసి..చిన్న చిన్న ముక్కలుగా చేసి, తర్వాత 4 నుంచి 5 బాదంపప్పులను గ్రైండ్ చేసి, తరిగిన మామిడికాయలో బాదం పొడి వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పంచదార వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. అలాగే 1 చెంచా పనీర్ , 2 కప్పుల పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే ఆరోగ్యకరమైన మ్యాంగో ప్రోటీన్ షేక్ సిద్ధమవుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Samudra Shastra: చేతికి 6 వేళ్లు ఉన్నవారు గురించి సముద్ర శాస్త్రం ఏం చెబుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mango Protein Shake: మ్యాంగో ప్రొటీన్ షేక్‌తో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మ్యాంగో ప్రొటీన్ షేక్‌తో శరీరానికి చాలా ప్రయోజనాలు
మ్యాంగో ప్రొటీన్ షేక్‌లో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు అధికం
శరీరానికి శక్తిని ఇస్తుంది