Green Tea: గ్రీన్ టీ ఎప్పుడు, ఎలా పుట్టింది, గ్రీన్ టీ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు
Green Tea: గ్రీన్ టీ. సకల సమస్యలకు కాకపోయినా చాలా సమస్యలకు పరిష్కారంగా వైద్యులు చెబుతుంటారు. ఆధునిక జీవనశైలిలో గ్రీన్ టీ ఓ భాగంగా మారింది. సన్నబడేందుకు ఓ ప్రత్యామ్నాయంగా ఉన్న గ్రీన్ టీ ఎప్పుడు పుట్టింది, ఎవరు కనిపెట్టారో తెలుసా. గ్రీన్ టీ సృష్టికర్తకు గూగుల్ డూడుల్ సమర్పించింది.
Green Tea: గ్రీన్ టీ. సకల సమస్యలకు కాకపోయినా చాలా సమస్యలకు పరిష్కారంగా వైద్యులు చెబుతుంటారు. ఆధునిక జీవనశైలిలో గ్రీన్ టీ ఓ భాగంగా మారింది. సన్నబడేందుకు ఓ ప్రత్యామ్నాయంగా ఉన్న గ్రీన్ టీ ఎప్పుడు పుట్టింది, ఎవరు కనిపెట్టారో తెలుసా. గ్రీన్ టీ సృష్టికర్తకు గూగుల్ డూడుల్ సమర్పించింది.
గ్రీన్ టీ(Green Tea Benefits). మెరుగైన ఆరోగ్యం కోసం గానీ, లావుగా ఉన్నవాళ్లు సన్నబడేందుకు గానీ ఓ మంచి పత్యామ్నాయం. కరోనా మహమ్మారికి ముందు నుంచే ప్రాచుర్యంలో ఉన్నా..కరోనాతో మరింతగా పెరిగింది. గ్రీన్ టీతో లాభాలేంటో తెలుసుకునే ముందు..గ్రీన్ టీను ఎవరు, ఎప్పుడు కనిపెట్టారో తెలుసుకుందాం. గ్రీన్ టీను తొలిసారిగా కనిపెట్టింది జపాన్‌కు చెందిన మిచియో సుజిమొరా. జపాన్‌లో ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్ కమ్ బయోకెమిస్ట్. గ్రీన్ టీలోను మూలకాల్ని ప్రపంచానికి తొలిసారిగా తెలియజేసింది ఈమెనే. 1888 సెప్టెంబర్ 17న జన్మించిన సుజిమొరా.. టోక్యో ఇంపీరియల్ యూనివర్శిటీలో బయోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేశారు. ముందుగా గ్రీన్ టీలో విటమిన్ బి1 ఉందని గుర్తించారు. తరువాత విటమిన్ సి ఉందని తేల్చారు. 1929లో జరిపిన పరిశోదనల్లో ఫ్లవనాయిడ్ కాటెచిన్, 1930లో టానిన్‌ను గుర్తించారు. తరువాత అన్నీ కలిపి ఆన్ ద కెమికల్ కాంపోనెంట్స్ ఆఫ్ గ్రీన్ టీ థియరీ రూపొందించారు.
గ్రీన్ టీలో పోషకాల్ని ప్రపంచానికి పరిచయం చేశారు.సెప్టెంబర్ 17న ఆమె జయంతి సందర్భంగా గూగుల్ ఆమెకు గుర్తుగా ఓ డూడుల్(Google Releases Doodle)విడుదల చేసింది. జపాన్ దేశంలో వ్యవసాయంలో డిగ్రీ పట్టా తీసుకున్న మొదటి మహిళ కూడా ఈమెనే. గ్రీన్ టీలో ఉండే ఎపిగాలోకేటెచిన్ 3 గ్యాలేట్ అనే పోషకం మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుందట మరోవైపు పోషకంలోని వాపు, మంటను తగ్గించే గుణం..మొటిమలు రాకుండా కూడా చేస్తుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ సేవనం ఓ మంచి డైట్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లావుగా ఉన్నవాళ్లు సన్నబడేందుకు గ్రీన్ టీ మంచి ప్రత్యామ్నాయం. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌తో(Anti Oxidants) హృదయం పదిలంగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుంది.
గ్రీన్ టీని ఎలా, ఎప్పుడు తాగకూడదో కూడా వివరణ ఉంది. అది తెలుసుకోకపోతే సమస్యలు ఎదురవుతాయి. గ్రీన్ టీ ఎప్పుడూ పరిమితంగానే తీసుకోవాలి. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ట్రిక్, లివర్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే..గర్భస్రావం కూడా జరిగే అవకాశాలున్నాయని జపాన్ పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి పడుకునేముందు గ్రీన్ టీ తీసుకోకూడదు. గ్రీన్ టీతో మందులు అస్సలు వేసుకోకూడదు. మరోవైపు మద్యాహ్నం భోజనం తరువాత గ్రీన్ టీ సేవిస్తే భోజనం ద్వారా లభించే పోషక విలువలు తగ్గిపోతాయి. ఈ జాగ్రత్తలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ గ్రీన్ టీ(Green Tea)సేవిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also read: India Corona Update: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా సంక్రమణ, 3 శాతం పెరుగుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook