ప్రస్తుత బిజీ జీవితం కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ తక్కువైపోయింది. అందుకే వయస్సు పెరిగే కొద్దీ సమస్యలు అధికమౌతున్నాయి. ఇందులో మలబద్ధకం సహా కడుపు సంబంధిత సమస్యలు చాలా ఉంటాయి. ఫలితంగా మొత్తం లైఫ్‌స్టైల్ ప్రభావితమౌతుంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే..చాలా రకాల సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాంకాయలు


మలబద్ధకం సమస్యకు జాంకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో చాలా రకాల న్యూట్రియంట్లు ఉన్నాయి. మరోవైపు ఫైబర్ కూడా అత్యధికం. ఇది కడుపు సంబంధిత చాలా సమస్యలకు ప్రయోజనం కల్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యకు జాంకాయలు అద్భుత ఔషధమని చెప్పవచ్చు.


సూప్


జాంకాయలతో సూప్ కూడా చేయవచ్చు. జాంకాయలు నేరుగా తినడం ఇష్టం లేకపోతే సూప్ రూపంలో తీసుకోవచ్చు. జాంకాయ గుజ్జు తీసి ఓ గిన్నె నీళ్లలో వేసి ఉడికించాలి. ఆ తరువాత వడకాయాలి. ఆ తరువాత జాంకాయ గుజ్జును వేరు చేసి అందులో దాల్చినచెక్క, నల్ల మిరియాలు, ఉప్పు వేసి కలపాలి. ఇవి గట్టిగా అయ్యేంతవరకూ వండాలి. ఈ సూప్‌లో కొద్దిగా పుదీనా ఆకులు, నల్ల ఉప్పు వేసి తింటే మంచి ఫలితాలుంటాయి.


జాంకాయలతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. జాంకాయలు పంటి సమస్యకు అద్భుతంగా పనిచేస్తాయి. నోటి పూత వంటివాటిని నిరోధిస్తాయి. చిగుర్ల నొప్పి ఉన్నప్పుడు లేత జామాకులు నమిలితే తక్షణం ఉపశమనం లభిస్తుంది. జాంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 


Also read: Diabetic Care Tips: మధుమేహ రోగులు పప్పుధాన్యాలు తినవచ్చా లేదా, ఏ పప్పులు తినాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook