Hair Blackening Tips: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరినీ కేశాల సంబంధిత సమస్యలు వెంటాడుతున్నాయి. జుట్టు తెల్లబడటం, రాలిపోవడం, నిర్జీవంగా ఉండటం వంటివి సహజంగా చూస్తున్నాం. జుట్టు నల్లబడేందుకు మార్కెట్‌లో ఎన్నో రకాల ఉత్పత్తులు ఉన్నా..అన్నీ తాత్కాలికమే కాకుండా రసాయనాలతో కూడుకున్నవి కావడంతో దుష్పరిణామాలు ఎక్కువ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జుట్టు తెల్లబడటమనేది సాధారణంగా వృద్ధాప్యంలో ఎదురయ్యేది. కానీ ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా 30-40 ఏళ్ల వయస్సులో సైతం వెంటాడుతోంది. జుట్టు తెల్లబడటానికి కారణాలు చాలానే ఉంటాయి. అనారోగ్యకరమైన జీవన విధానం, కాలుష్యం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, పోషకాహార లోపం, విటమిన్ బి12 లోపం, విటమిన్ డి3 లోపం, ఐరన్ లోపాల్లో ఏ కారణంతోనైనా ఈ సమస్య తలెత్తవచ్చు. అందుకే మార్కెట్‌లో లభించే వివిధ రకాల డైలను వాడే కంటే ఈ పోషకాలుండే పదార్ధాలను ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. జుట్టు సహజసిద్ధంగా నల్లబడేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పదార్ధాలేంటో తెలుసుకుందాం..


ఉసిరి శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనం కల్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉసిరి సేవించాల్సి ఉంటుంది. కేశాల ఆరోగ్యం కోసం నిగెల్లా  లేదా బ్లాక్ సీడ్స్ చాలా అవసరమౌతాయి. జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిని రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకోవాలి. వీటితో పాటు నువ్వులు, బ్లాక్ బీన్స్, జీలకర్ర, చియా సీడ్స్, నల్ల బెల్లం కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి.


కేశాలు ఆరోగ్యంగా, సమృద్ధిగా ఉండాలంటే తగిన పోషకాలు అవసరం. ఈ పోషకాల కోసం వీట్ గ్రాస్ జ్యూస్ లేదా బార్లీ గ్రాస్ జ్యూస్ చాలా మంచిది. ఈ రెండింట్లో కేశాల ఆరోగ్యానికి కావల్సిన పోషకాలుంటాయి. కేవలం జుట్టు సంరక్షణకే కాకుండా కాలేయాన్ని కూడా పరిరక్షిస్తుంది. జుట్టు ఆరోగ్యం కోసం క్యాటలేస్ అనే పదార్ధం అవసరమౌతుంది. ఇది బ్రోకోలి, స్వీట్ పొటాటో, క్యారెట్, వెల్లుల్లిలో కావల్సినంత లభిస్తుంది. 


కేశాలు తెల్లబడకుండా ఉండాలంటే కొన్ని పదార్ధాలను దూరం పెట్టాలి. ముఖ్యంగా షుగర్ కంటెంట్ కలిగిన పదార్ధాలకు స్వస్తి పలకాలి. జంక్ ఫుడ్ తినకూడదు. పాల ఉత్పత్తులు అతిగా సేవించకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ మంచిది కాదు. ఈ సూచనలన్నీ పాటిస్తే కేశాలను సహజసిద్ధంగా నల్లబర్చుకోవడం పెద్ద కష్టమేం కాదంటున్నారు.


Also read: Mental Health Telugu: ప్రతి రోజు ఇలా పాలు తాగితే ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జయిటీ నుంచి ఉపశమనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook