Mental Health Telugu: ప్రతి రోజు ఇలా పాలు తాగితే ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జయిటీ నుంచి ఉపశమనం..

Milk For Depression: డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు పాలను తాగడం గొప్ప ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2023, 03:42 PM IST
 Mental Health Telugu: ప్రతి రోజు ఇలా పాలు తాగితే ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జయిటీ నుంచి ఉపశమనం..

 

Milk For Depression: ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు వేగంగా పెరిగిపోతున్నాయి. దీని కారణంగా కొంతమందిలో ఒత్తిడి వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండాలంటే తప్పకుండా శరీరపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో డిప్రెషన్, ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు పాలు తాగాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడి ఇతర సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. 
 
డిప్రెషన్‌ సమస్యతో బాధపడేవారు పాలు తాగడం ఎంతవరకు ప్రయోజనకరమో తెలుసా?  
ఇటీవలే కొన్ని ప్రముఖ యూనివర్సీలు డిప్రెషన్‌ సమస్యపై అధ్యయనం చేశాయి. పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఈ సమస్యతో బాధపడేవారు పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనకంగా ఉంటుందని తెలింది. ప్రతి రోజు పాలను తాగేవారిలో ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అధ్యయనాల్లో తెలింది. అంతేకాకుండా మానసిక సమస్యల నుంచి కూడా దూరమవుతాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
 
క్యారెట్ తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు:
పాలను క్యారెట్‌తో కలిపి తీసుకోవడం వల్ల  డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్యారెట్‌లో లభించే బీటా కెరోటిన్ డిప్రెషన్‌ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మానసిక దృఢత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 
 
గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ శరీరానికి బోలెడు లాభాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఈ వెజ్జీస్‌లో ఉండే ఫోలేట్ సులభంగా డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఒత్తిడి కారణంగా వచ్చే బీపీ, మానసిక సమస్యల బారిన పడకుండా చూస్తాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News