Hair Care Tips: ఆరోగ్యం గురించి చర్మ సంరక్షణ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో కేశాల గురించి కూడా అంతే రీతిలో ఆలోచించాలి. తగిన చర్యలు తీసుకోవాలి. చాలామందికి సీజన్ మారగానే కేశాల సమస్యలు పెరిగిపోతాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు ఇట్టే పరిష్కారం చెక్ చెప్పవచ్చంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణం మారగానే అనారోగ్యం ఎలా వెంటాడుతుందో అదే విధంగా కేశ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. ముఖ్యంగా జుట్టు రాలడం అధికమౌతుంది. సాధారణంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఖరీదైన షాంపూలు, హెయిర్ మాస్క్ లేదా ట్రీట్‌మెంట్స్ వినియోగిస్తుంటారు. కానీ ఈ విదానాలు అన్నీ ఖరీదైనవే కాకుండా కెమికల్స్‌తో నిండి ఉండటం వల్ల ఏ విధమైన ప్రభావం కన్పించదు. ఇంకా దుష్పరిణామాలు ఉండవచ్చు. అదే సహజసిద్ధంగా ఇంట్లో తయారు చేసుకునే హెయిర్ మాస్క్‌తో ఈ సమస్య చాలా సులభంగా పరిష్కారమౌతుంది. ప్రతి ఇంట్లో లభించే పెరుగు, ఆవాల నూనె, నిమ్మరసం వంటివాటితో ఇది తయారు చేయవచ్చు. ఈ హెయిర్ మాస్క్ రాయడం వల్ల కేశాలు నిగినిగలాడతాయి. కేశాలు పటిష్టంగా, మృదువుగా, కోమలంగా, మెరుస్తుంటాయి.


హెయిర్ మాస్క్ లేదా కండీషనర్ తయారీకు పెరుగు, ఆవాల నూనె 2 చెంచాలు, నిమ్మరసం అవసరమౌతాయి. ముందుగదా ఓ గిన్నె తీసుకోవాలి. ఇందులో పెరుగు, రెండు చెంచాల ఆవాల నూనె, ఒక చెంచా నిమ్మరసం కలపాలి, ఈ మూడింటినీ బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. అంతే మీక్కావల్సిన హెయిర్ ప్యాక్ సిద్ధం.


ఈ హెయిర్ ప్యాక్ రాసేముందు జట్టును సరిగ్గా దువ్వుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కేశాలకు, కుదుళ్లకు బాగా పట్టించాలి. ఆ తరువాత జుట్టుకు క్యాప్ ధరించి కవర్ చేయాలి. ఓ గంట సేపు అలానే ఉండనివ్వాలి. ఆ తరువాత ముందు నీళ్లతో శుభ్రం చేసుకుని మైల్డ్ షాంపూతో రుద్దుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలుంటాయి. మీ జుట్టు మృదువుగా, కోమలంగా మారుతుంది. అంతేకాకుండా కేశాలకు అదనపు రక్షణ కలుగుతుంది. జుట్టు రాలే సమస్య దూరమౌతుంది.


Also read: Diabetes Risk: రోజూ ఈ పదార్ధాలు తీసుకుంటే మధుమేహం ముప్పుండదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook