Hair Care Tips: చలికాలంలో జుట్టు ఎండిపోతోందా..అది రాస్తే కేవలం 1 రోజులోనే పరిష్కారం
Hair Care Tips: చలికాలంలో ఆరోగ్యం సహజంగా వికటిస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వివిధ రకాల సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా డ్రైనెస్ అతిపెద్ద సమస్యగా మారుతుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి..
చలికాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురైనట్టే..కేశాల సమస్య కూడా ఉంటుంది. ముఖ్యంగా కేశాల్లో డ్రైనెస్ అనేది ప్రధాన సమస్య. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే..కీరా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
కీరా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. కీరాతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాకుండా..కేశాలకు కూడా చాలా లాభదాయకం. కీరాతో కేశాలకు సంబంధించిన పలు సమస్యలు దూరమౌతాయి. కీరాను జుట్టుకు పలువిధాలుగా రాయవచ్చు. కీరాలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. దాంతోపాటు పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కీరా వినియోగంతో ఆరోగ్య ప్రయోజనాలకే కాకుండా..చర్మం, కేశాలకు కూడా ఉపయోగం. కీరాను కేశాలకు రాయడం వల్ల కేశాల డ్రైనెస్ సమస్య పోతుంది.
కీరా కేశాలకు ఎలా అప్లై చేయాలి
కీరా జ్యూస్‌తో మసాజ్
కేశాల నిగారింపుకై కీరా జ్యూస్ చాలా మంచిది. దీనికోసం మీ కేశాల పొడుగుని బట్టి 1-2 కీరాలు తీసుకోవాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కీరా జ్యూస్‌ను ఓ గిన్నెలో తీసుకుని..కొద్దికొద్దిగా జుట్టు మొదళ్లలో రాసి కాస్సేపు వదిలేయాలి. ఆ తరువాత మస్సాజ్ చేయాలి. చివరిగా నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. షాంపూ వినియోగించకూడదు.
కీరా జ్యూస్, నిమ్మకాయ
కీరా జ్యూస్, నిమ్మరసం కలిపి రాయడం వల్ల డేండ్రఫ్ సమస్య దూరమౌతుంది. కావల్సినంత కీరా జ్యూస్ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి ఓ అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి.
Also read: Diabetes Control Tips: ఆ నాలుగు చిట్కాలు పాటిస్తే..జీవితంలో ఎప్పుడూ డయాబెటిస్ దరిచేరదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook