Hair Fall Reduce Tips: విపరీతంగా జట్టు రాలుతుందా? అయితే ఈ యోగాసనాలు ట్రై చేయండి!
Hair Fall Reduce Tips: శీతాకాలంలో జట్టు రాలే సమస్య చాలా మందిని వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అందుకు కారణం ఒత్తిడే అని నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఏర్పడే హెయిర్ ఫాలింగ్ కు యోగా ద్వారా ఫుల్ స్టాప్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. యోగాతో జట్టు రాలే సమస్యను దూరం చేసుకునేందుకు ఈ యోగాసనాలను పాటించండి.
Hair Fall Reduce Tips: శీతాకాలం చాలా మందికి ఇష్టమైన సీజన్. అయితే ఈ సీజన్ లో జుట్టు రాలిపోయే సమస్య చాలా మందిని వేధిస్తోంది. ఈ సమస్య ముఖ్యంగా మహిళలకు ఆందోళనకు గురిచేస్తుంది. అయితే జట్టు రాలడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. దీని కారణంగా చాలామందికి జట్టు తెల్ల బడడం, జట్టు పలుచుగా అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని యోగాసనాల ద్వారా ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.
యోగా సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని అందరికీ తెలిసిందే. శరీరంలోని మానసిక, శారీరక సమస్యలను పరిష్కరించడానికి యోగా సహాయపడుతుంది. ఇప్పుడు జట్టు రాలడానికి యోగసనాలు ద్వారా నియంత్రించుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జుట్టు రాలే సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యోగా ఈ సమస్యను దూరం చేస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయి. జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ యోగాసనాల ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ ప్రత్యేక యోగాసనాల ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడడమే కాకుండా.. జట్టు ఎదుగుదలకు సహకరిస్తుంది. ఇంతకీ ఆ యోగాసనాలు ఏ విధంగా వేయాలో ఒకసారి తెలుసుకుందాం.
జట్టు రాలడాన్ని అరికట్టేందుకు బాలయం ముద్ర
[[{"fid":"221329","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
పైన ఫొటోలో చూపిన విధంగా మీ గోళ్లను ఒకదానితో ఒకటి రుద్దుకునే ప్రక్రియను బాలయం ముద్ర అంటారు. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఇది సులభమైన మార్గాలలో ఒకటి. ఈ ముద్రను క్రమం తప్పకుండా 5-10 నిమిషాలు చేయడం వల్ల జుట్టు రాలిపోయే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతారు.
అధోముఖ స్వానాసనం
[[{"fid":"221330","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ఈ యోగాసనం మీ మనస్సును ప్రశాంతగా ఉండేలా చేస్తుంది. తద్వారా మీలో నెలకొన్న ఆందోళన, ఒత్తిడిని తగ్గించడం సహా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మంచి జీర్ణవ్యవస్థ జుట్టుకు మరింత పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.
వజ్రాసనం
[[{"fid":"221331","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
యోగాలో వజ్రాసనానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇది జట్టు రాలడాన్ని తగ్గించేందుకు సహకరిస్తుంది. పైన పేర్కొన్న యోగాసనాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల జట్టు రాలే సమస్యలను నియంత్రించవచ్చని యోగా నిపుణులు అంటున్నారు.
జుట్టు రాలడం అనేది చిన్న సమస్య కాదు. కానీ ఇది చాలా ఆరోగ్య సమస్యలకు సూచిక. మొత్తంమీద ఆరోగ్యకరమైన శరీరాన్ని సాధించాలంటే, శరీరం ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యను కూడా విస్మరించకూడదు. శరీరం, మనస్సు రెండింటినీ ప్రభావితం చేసే సమస్యలను నయం చేయడానికి యోగా ఒక గొప్ప మార్గం!
Also Read: Dark Circles: కంటి కింది నల్లటి వలయాలకు అద్భుతమైన ఇంటింటి చిట్కాలు ఇవే
ALso Read: Brain Stroke Symptoms: ఇలా స్నానం చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.