Brain Stroke Symptoms: చలికాలంలో మరీ ముఖ్యంగా గత నెల రోజులుగా దేశంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు బాగా పెరిగిపోయాయి. దీని వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదకరమైన బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండేందుకు వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవెంటో ఒకసారి తెలుసుకుందాం.
చలికాలంలో చాలా మంది చల్లటి నీటితో స్నానం చేస్తున్నారని వైద్యనిపుణులు అంటున్నారు. చల్లటి నీటితో సరాసరి తలపై పోసుకోవడం మూలంగా.. ఆ నీటి ఉష్ణోగ్రతను మెదడు తట్టుకోలేదని చెబుతున్నారు. ఎక్కువగా తలపై విపరీతమైన చల్లటి నీటిని పోసుకోవడం వల్లనే ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.
బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడైనా రావొచ్చు.. కానీ, చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. మధుమేహం, అధిక బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ హెమరేజ్‌కి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలికాలంలో చల్లటి నీటికి బదులుగా కొద్దిగా వేడి నీటితో స్నానం చేయడం ఉత్తమం. తలస్నానం చేసేప్పుడు ముందుగా పాదాలకు.. తర్వాత చేతులకు, ఆ తర్వాత ముఖంపై.. చివరగా తలపై నీళ్లు పోసుకోవాలి. అయినప్పటికీ బ్రెయిన్ స్ట్రోక్ సంకేతాలు ఏర్పడితే దగ్గర్లోని వైద్యుడ్ని సంప్రదించడం ఉత్తమం.
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు..
1) శరీరంలోని ఏదైనా భాగంలో తిమ్మిరి
2) కనుచూపు స్పష్టంగా కనిపించకపోవడం
3) శరీరంపై చీమలు పాకుతున్న అనుభూతి
4) తలనొప్పి, వాంతులు లేదా వికారం
5) మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడం కష్టమవడం
6) శ్వాస ఆడకపోవుట
7) మెదడులో రక్తస్రావం కారణంగా స్పృహ తప్పడం వంటిని బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.
బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉన్న వాళ్లు:
1) రక్తపోటు ఉన్న రోగులు
2) 55 ఏళ్లు పైబడిన వ్యక్తులు
3) మధుమేహం ఉన్న రోగులు
4) మైగ్రేన్ లేదా రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు
5) ఊబకాయంతో పోరాడుతున్న వ్యక్తులు
6) బ్రెయిన్ స్టోక్ కు నివారణ
7) చలిలో నేలపై లేదా గడ్డిపై చెప్పులు లేకుండా నడవవద్దు.
8) ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి.
9) శరీరంలో నీటి కొరత ఉండకూడదు.
10) ఎల్లప్పుడూ వేడి లేదా గోరు వెచ్చని నీటిని త్రాగాలి.
11) ధూమపానం లేదా మద్యం సేవించవద్దు.
12) హై బీపీ, షుగర్‌కి మందులు వాడొచ్చు.
Also Read: Dandruff: శీతాకాలంలో చుండ్రు సమస్య వేధిస్తోందా...ఈ చిట్కాలు పాటించండి చాలు
Also Read: Omicron Variant Twice: ఒకే వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎన్నిసార్లు సోకుతుందో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.