Skipping Dinner: రాత్రి వేళ డిన్నర్ ఎందుకు మానకూడదు, ఎంత ప్రమాదకరమంటే
Skipping Dinner: నిత్య జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యలకు కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి. ఈ రెండూ సక్రమంగా లేకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా జీవనశైలి విపరీతమైన ప్రభావం చూపిస్తుంంటుంది.
Skipping Dinner: ప్రపంచంలో ఏ మూలన ఎక్కడున్నా ప్రతి ఒక్కరి ఆహరపు అలవాటు ఒక్కటే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మద్యాహ్నం, రాత్రి భోజనం. తినే ఆహారంలో తేడా ఉంటుందేమే గానీ రోజుకు మూడు పూట్ల తినడం ప్రపంచమంతా ఒకటే అలవాటు. జీవనచక్రం ఆలా ఉంటుంది అందుకే ఈ అలవాటు. ఈ జీవనచక్రం గతి తప్పితేనే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
ఆధునిక జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఉదయం, మద్యాహ్నం, రాత్రి తప్పకుండా తినాల్సిందే. శరీరానికి అవసరమైన పోషకాలు ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. తినే ఆహారంలో తేడా ఉన్నా..సమయానికి మాత్రం తప్పకుండా తినాల్సిందే. కొంతమంది డైటింగ్ పేరు చెప్పో లేదా మరే ఇతర కారణంతోనే రాత్రి డిన్నర్ మానేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల ప్రతికూల పరిణామాలుంటాయి. పనిలో పడి లేదా పనితో అలసిపోయి రాత్రి భోజనం చేయకుండా అలానే పడుకుండిపోతుంటారు. ఇంకొందరైతే రాత్రి వేళ భోజనం మానేసి డైటింగ్ చేస్తే బరువు తగ్గుతామనే ఆలోచనలో ఉంటారు. ఇది పూర్తిగా తప్పు. మంచి అలవాటు కానే కాదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రాత్రి డిన్నర్ స్కిప్ చేస్తే కలిగి దుష్పరిణామాల గురించి తెలుసుకుందాం.
కారణం ఏదైనా సరే రాత్రి వేళ డిన్నర్ స్కిప్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి పూట ఏం తినకుండా పడుకుంటే అర్ధరాత్రి సమయంలో ఆకలి మొదలౌతుంది. దాంతో రోజుకు కావల్సిన 7-8 గంటల ప్రశాంత నిద్ర కరువౌతుంది. ఫలితంగా మరుసటి రోజు తీవ్రమైన అలసట, నీరసం ఆవహిస్తాయి. అందుకే డిన్నర్ వదలడం మంచిది కాదు.
రాత్రి డిన్నర్ స్కిప్ చేస్తే బరువు తగ్గిపోతామని భావించడం సరైంది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గే విషయం పక్కనబెడితే శరీరంలో అవసరమైన పోషకాలు ఎప్పటికప్పుడు అందకుండా ఉంటాయి. పోషకాల లోపం కూడా ఏర్పడవచ్చు. దీంతోపాటు ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. శరీరం పనితీరుపై ప్రభావం పడుతుంది. రోజూ అదే పనిగా డిన్నర్ మానేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి.
ఒక్కోసారి సమయం లేదనే కారణంతో వంట వండలేక రాత్రి పూట డిన్నర్ మానేస్తుంటారు. రాత్రి భోజనం అనేది చాలా అవసరం. ఇది లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా శరీరానికి కావల్సిన ఎనర్జీ లభించదు. అందుకే ఒక్కపూట రాత్రి భోజనం మానేసినా ఆ ప్రభావం మరుసటి రోజు తప్పకుండా పడుతుంది.
Also read: Chia Seeds: మధుమేహం వ్యాధిగ్రస్థులు చియా సీడ్స్ తినవచ్చా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook