Healthy Heart: పప్పులు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే..ఏయే రకాల పప్పుల్ని డైట్‌లో చేర్చాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం అన్నింటికంటే ప్రధానమైంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం సరిగ్గా ఉండాలి. ఇక గుండె సంబంధిత రోగాలకు చెక్ పెట్టాలంటే మీ గుండె ఆరోగ్యంగా ఉండాలి. అందుకే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డైట్ సరిగ్గా ఉంటే..గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఏ విధమైన గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. మరి గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి పదార్ధాలు అవసరమో తెలుసా మీకు..


పప్పులు అద్భుతమైన పోషక పదార్ధాలని అందరికీ తెలుసు. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అదే సమయంలో గుండె ఆరోగ్యానికి పప్పులు చాలా అవసరమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పప్పులు గుండెను పదిలంగా ఉంచుతాయి. ఎలాంటి పప్పులు అవసరమో పరిశీలిద్దాం..


పెసరపప్పు


పెసరపప్పు అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే పెసరపప్పును చిన్నారుల్నించి వృద్ధుల వరకూ అందరికీ ఇవ్వవచ్చు. అన్నంతో కూడా రుచి బాగుంటుంది. చాలా పౌష్టిక ఆహారమైనందున రోగులకు కూడా హాయిగా తిన్పించవచ్చు. పెసరపప్పులో ఫోలేట్, ప్రోటీన్లు, మెగ్నీషియం ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే మీ రోజువారీ డైట్‌లో తప్పకుండా చేర్చాలి.


మినప పప్పు


మినప పప్పు చాలా రుచికరమైంది. మినప పప్పును నిర్ణీత పద్దతిలో డైట్‌లో చేరిస్తే గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మినప పప్పులో తగిన మోతాదులో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. అంతేకాకుండా..బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అయితే పగటి పూట మాత్రమే మినప పప్పు తీసుకోవాలి.


మసూర్ దాల్


మసూర్ దాల్‌ను దాదాపుగా అందరూ ఇష్టపడతారు. ఈ పప్పు సులభంగా జీర్ణమౌతుంది. వండటం కూడా తేలికే. మసూర్ దాల్‌లో కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.


Also read: Heart Tests: మీ గుండె ఆరోగ్యాన్ని వెంటనే చెప్పే 7 కీలకమైన పరీక్షలు ఇవే, వెంటనే చేయించండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook