Brown Rice Benefits: వైట్ రైస్..బ్రౌన్ రైస్‌కు తేడా ఏంటి, వైట్ రైస్ వల్ల కలిగే లాభాలేంటి

Brown Rice Benefits: ఆహారపు అలవాట్లు ఎంత బాగుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. రోజూ తినే వైట్ రైస్ కంటే..బ్రౌన్ రైస్ ఆరోగ్యపరంగా చాలా మంచిది. అసలు బ్రౌన్ రైస్‌తో ఏయే ప్రయోజనాలు కలగనున్నాయనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2022, 10:17 PM IST
Brown Rice Benefits: వైట్ రైస్..బ్రౌన్ రైస్‌కు తేడా ఏంటి, వైట్ రైస్ వల్ల కలిగే లాభాలేంటి

Brown Rice Benefits: ఆహారపు అలవాట్లు ఎంత బాగుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. రోజూ తినే వైట్ రైస్ కంటే..బ్రౌన్ రైస్ ఆరోగ్యపరంగా చాలా మంచిది. అసలు బ్రౌన్ రైస్‌తో ఏయే ప్రయోజనాలు కలగనున్నాయనేది తెలుసుకుందాం..

ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురయ్యే సకల రోగాలకు కారణం చెడు ఆహారపు ఆలవాట్లే. దేశంలో సగటున ఎక్కువమంది తినేది వైట్ రైస్. వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్ ఆరోగ్యపరంగా అధిక ప్రయోజనాల్ని అందిస్తుంది. అందుకే ఆధునిక జీవనశైలిలో బ్రౌన్ రైస్ ప్రాచుర్యంలో వస్తోంది. ఎక్కువ మంది బ్రౌన్ రైస్‌ను ఆశ్రయిస్తున్నారు.

బ్రౌన్ రైస్ అంటే ఏమిటి

బ్రౌన్ రైస్ అంటే ధాన్యం తొక్కని తొలగించిన తరువాత ఉండే బియ్యమే. రంగు కాస్త బ్రౌన్ కలర్‌లో ఉండటం వల్ల బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. బియ్యాన్నిపూర్తిగా ప్రోసెస్ చేయనప్పుడు ఇదే రంగులో ఉంటుంది. పూర్తిగా శుభ్రం చేస్తే తెలుపు రంగులో ఉంటుంది. ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ప్రోసెస్ చేయని బియ్యం కాబట్టే..ఇందులో న్యూట్రియంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. బ్రౌన్ రైస్ లేదా అన్‌ప్రోసెస్డ్ రైస్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

బ్రౌన్ రైస్ ప్రయోజనాలు, మీ గుండె పదిలం

బ్రౌన్ రైస్‌లో పుష్కలంగా లభించే పోషక పదార్ధాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇందులో లభించే ఫైబర్ గుండె సంబంధిత వ్యాధులు, ముప్పును తగ్గిస్తాయి. ఇందులో లిగ్నాన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును తగ్గిస్తాయి.

బరువు తగ్గించేందుకు

బ్రౌన్ రైస్ తినడం వల్ల మీ శరీర బరువు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇది రిఫైండ్ రైస్ కాదు. అదే వైట్ రైస్ లేదా ప్రోసెస్డ్ బియ్యంలో న్యూట్రియంట్లు, ఫైబర్ చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరానికి పోషక పదార్ధాలు తక్కువగా లభిస్తాయి. అదే బ్రౌన్ రైస్ తింటే మాత్రం..పుష్కలంగా ఉండే ఫైబర్, న్యూట్రియంట్ల కారణంగా బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం చాలామంది స్థూలకాయానికి చెక్ పెట్టే క్రమంలో బ్రౌన్ రైస్‌ను ఆశ్రయిస్తున్నారు. 

Also read: Protein poisoning: ప్రోటీన్లు విషతుల్యమౌతాయా..ఎందుకు, కారణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News