Health Benefits of Chia Seeds: చియా సీడ్స్.. ఆరోగ్యానికి అద్భుత ఔషధం, డయాబెటిస్, గుండె వ్యాధులు సైతం దూరం
Health Benefits of Chia Seeds: కొన్ని రకాల విత్తనాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. పోషక పదార్ధాలతో నిండి ఉన్న చియా సీడ్స్ ఇందులో అతి ముఖ్యమైనవి. చియా సీడ్స్ తినడం వల్ల హార్ట్ ఎటాక్, స్థూలకాయం వంటి సమస్యలు దూరమౌతాయి.
Health Benefits of Chia Seeds: చియా సీడ్స్ ఆరోగ్యానికి అత్యంత లాభదాయకం. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ బి6, విటమిన్ బి2, విటమిన్ బి12, విటమిన్ సి వంటి పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతుంటాయి. అందుకే డైట్‌లో వీటిని తప్పకుండా చేర్చాలి.
శరీరానికి మెరుగైన ఆరోగ్యం అందించడంలో వివిధ రకాల విత్తనాలు కీలక భూమిక పోషిస్తుంటాయి. ముఖ్యంగా చియా సీడ్స్ ఇందులో అతి ముఖ్యమైనవి. చియా సీడ్స్‌లో కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకుంటే పలు సీరియస్ వ్యాధుల ముప్పు దూరమౌతుంది. చియా సీడ్స్ హార్ట్ ఎటాక్, ఎనీమియా, స్థూలకాయం వంటి సమస్యలు దూరమౌతాయి.
గుండెకు ఆరోగ్యం
చియా సీడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సిలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. చియా సీడ్స్ రక్త సరఫరాను మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
బరువు తగ్గడం
చియా సీడ్స్ తినడం వల్ల బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడంలో దోహదం చేస్తుంది. బరువు తగ్గించేందుకు చియా సీడ్స్ తినడం అత్యంత లాభదాయకం.
ఎముకలకు బలం
చియా సీడ్స్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎముకలు, మజిల్స్ పటిష్టతకు దోహదం చేస్తాయి. ఎముకల నొప్పి సమస్యను దూరం చేస్తాయి. పాలతో చియా సీడ్స్ తినడం వల్ల మరింత ప్రయోజనకరమౌతుంది.
రక్త హీనతకు చెక్
చియా సీడ్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. చియా సీడ్స్‌లో విటమిన్ బీ6, విటమిన్ బీ12, విటమిన్ సి, ప్రోటీన్లు, ఫ్లోయేట్స్ వంటి పోషకాలుంటాయి. ఇవి రక్త హీనతను దూరం చేస్తాయి. చియా సీడ్స్ తినడం వల్ల ఎనీమియా వంటి వ్యాధుల ముప్పు దూరమౌతుంది.
చియా సీడ్స్ డయాబెటిస్‌కు చాలా లాభదాయకం. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రిస్తాయి.
Also read: Heart Attack Risk: ముప్పై నలభై ఏళ్లకే గుండెపోటు సమస్య, కారణాలేంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook