Prevent Diabetes, Anemia, Heart Diseases & Indigestion Problem with Papaya: అనారోగ్యానికి గురైనప్పుడే కాదు..ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బొప్పాయిలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని రకాల వ్యాధులు సంక్రమించినప్పుడు బొప్పాయి ఓ ఔషధంలా పనిచేస్తుంది. బొప్పాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో బొప్పాయి చాలా ముఖ్యమైంది. బొప్పాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లెక్కలేనివి. మెరుగైన ఆరోగ్యం కోసం బొప్పాయి తీసుకోవడమనేది అనాదిగా వస్తున్నదే. ఆయుర్వేదంలో కూడా బొప్పాయి ప్రయోజనాల ప్రస్తావన ఉంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఇంకా ఇతర పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలుండటం విశేషం. ఇందులో విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి మినరల్స్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. 


గుండె సంరక్షణ:


బొప్పాయిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించేందుకు దోహదపడతాయి. బొప్పాయిలో ఉండే ఫోలేట్ కారణంగా రక్త నాళాలు పాడవకుండా ఉంటాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. బొప్పాయిలో ఉండే పొటాషియం మొత్తం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫలితంగా వ్యాధుల ముప్పు తగ్గుతుంది. బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడి..మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. 


మధుమేహానికి సూపర్ ఫుడ్:


డయాబెటిస్ రోగులు చాలా రకాల పండ్లను తినకూడదు. ఎందుకంటే చాలా పండ్లకు గ్లైసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పండ్లు తింటే షుగర్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ రోగులకు బొప్పాయి ఓ ఔషధం లాంటింది. బొప్పాయిలో మాత్రం గ్లైసోమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ రోగులు బొప్పాయి హాయిగా తినవచ్చు. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మధుమేహ వ్యాధిగ్రస్థులకు లాభదాయకం.


రోగ నిరోధక శక్తి:


ఇమ్యూనిటీ పెంచేందుకు బొప్పాయిని మించింది లేదు. కరోనా మహమ్మారి సమయంలో బొప్పాయి ఎక్కువగా తినేవారు. బొప్పాయి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటిమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక బొప్పాయితో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే..వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బొప్పాయి జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ బలోపేతమౌతుంది. మల బద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు దూరమౌతాయి.


రక్త హీనత దూరం:


బొప్పాయిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎనీమియా వంటి వ్యాధుల్లో ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ తినడం వల్ల ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలు దూరమౌతాయి. బొప్పాయితో ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ కే ఎముకల్లోని కాల్షియం కొరతను తీరుస్తుంది. బొప్పాయి తినడం వల్ల ఎముకలకు సంబంధించిన నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆర్ధరైటిస్ వ్యాధులు దూరమౌతాయి.


Also Read: Diabetes Tips: టైప్ 2 డయాబెటిస్‌‌తో బాధపడుతుంటే..రోజూ ఆ టీ తాగితే నెలరోజుల్లో మధుమేహం మాయం


Also Read: Taraka Ratna Wife Alekhya Reddy : ఏడిపించేస్తోన్న తారక రత్న భార్య పోస్ట్.. భర్త జ్ఞాపకాల్లో అలేఖ్య రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook