Health Benefits of Blueberries: బ్లూబెర్రీస్ ని కొంతమంది ఇష్టలేకపోవడం వల్ల అవాయిడ్ చేస్తుంటారు. కానీ అవి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మీరు వాటిని అస్సలు విడిచిపెట్టరు. అవేంటో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ చదవాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లూబెర్రీస్‌తో గుండెకు మేలు :
బ్లూబెర్రీస్‌ రెగ్యులర్ గా తినే వారికి బీపీ తగ్గి రక్తనాళాలు పని తీరు మెరుగుపడుతుంది. తద్వారా గుండె పని తీరు కూడా మెరుగుపడుతుంది. బ్లూబెర్రీస్‌ క్రమం తప్పకుండా తినే వారు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం లేదని పలు అధ్యయనాల్లోనూ వెల్లడైంది.


బ్లూబెర్రీస్‌‌లో యాంటీఆక్సీడెంట్స్ పుష్కలం
బ్లూబెర్రీస్‌‌లో ఆంతోక్యానిన్స్ అంటే యాంటీఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీస్ తినడం ద్వారా ఒంటికి చేరే ఈ ఆంతోక్యానిన్స్ యాంటీ ఆక్సీడెంట్స్ క్యాన్సర్, డయాబెటిస్, గుండె సంబధిత జబ్బులను దూరం చేయడంతో పాటు మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా నివారించడానికి ఆంతోక్యానిన్స్ యాంటీ ఆక్సీడెంట్స్ సహాయపడతాయి.


జీర్ణ క్రియ
బ్లూబెర్రీస్‌‌ క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. బ్లూబెర్రీస్‌‌లో అధిక మోతాదులో ఉండే ఫైబర్ అందుకు కారణం. రిచ్ ఫైబర్ ఫుడ్ అవడం వల్ల జీర్ణశక్తి పెరగడంతో పాటు మల బద్ధకాన్ని నివారిస్తుంది.


మెదడు పని తీరు పెంచుతుంది
పరిశోధనలు చెబుతున్న ఫలితాల ప్రకారం బ్లూబెర్రీస్‌‌ రెగ్యులర్‌గా తినే వారిలో జ్ఞాపకశక్తి పెరగడం, ఏకాగ్రత పెరగడం వంటివి స్పష్టంగా కనిపించాయి. బ్లూబెర్రీస్‌‌లో ఉండే యాంటీ ఆక్సీడెంట్స్ మెదడులో కణాల మధ్య సమన్వయం పెంచడమే అందుకు కారణం. మెదడుపై ఒత్తిడిని తగ్గించడానికి కూడా బ్లూబెర్రీస్‌‌లోని యాంటీఆక్సీడెంట్స్ ఉపయోగపడతాయి.  


పలు రకాల క్యాన్సర్ జబ్బుల నివారిణి


బ్లూబెర్రీస్‌‌లో ఉండే యాంటీఆక్సీడెంట్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి జబ్బులను నివారించడానికి సహాయపడతాయని పలు పరిశోధనల్లో తేలింది. అయితే, ఈ కోణంలోనే ఇప్పటికీ కొన్ని పరిశోధనలు జరుగుతుండటం గమనార్హం.


ప్రస్తుతం మనం చూస్తున్న నేటి తరం లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్ చేయడం, డ్రింకింగ్ వంటి అలవాట్ల వల్ల చాలామంది గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, డయాబెటిస్ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఆయా వ్యాధులను నివారించే ఆంతోక్యానిన్స్ అనే ఆంటీయాక్సిడెంట్స్ ఈ బ్లూబెర్రీస్‌‌లోనే అధికంగా ఉండటం వల్ల.. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతైనా మేలు జరుగుతుందని హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.


ఇది కూడా చదవండి : PM Svanidhi Yojana: ఈ లోన్ తీసుకుంటే నయాపైస వడ్డీ లేదు.. గ్యారెంటీ అసలే లేదు..


ఇది కూడా చదవండి : Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ


ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook