భారతీయ వంటకాలలో జీలకర్ర ( Cumin Seeds ) ఎంత ప్రధానమో అందరికీ తెలిసిందే. తెలుగువారి పోపుల పెట్టె జీలకర్ర లేనిదే పూర్తి అవదు. కిచెన్ లో  దాని ప్రాధాన్యత అలాంటిది. అందుకే మన పూర్వికులు జీలకర్రను పోపు దినుసుల్లో ప్రధానమైన పదార్ధం అని తెలిపారు. ఇందులో ఉండే యాంటి ఇంఫ్లామేటరీ, యాంటీ ఆక్సిండెంట్ అంశాలు ఆరోగ్యాన్ని ( Health ) కాపాడుతాయి.  దాంతో పాటు మరిసే చర్మం ( Skin ) సొంతం అవుతుంది. రక్తం శుద్ధి జరుగుతుంది. జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అరుదైన ఘనత సాధించిన చెన్నై సూపర్ కింగ్ ప్లేయర్ డిజే బ్రావో 


జీలకర్రల్లో యాంటీయాక్సిడెంట్ శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల ముఖంపై మడతలు రావడం, డార్క్ సర్కిల్స్ ( Dark Circles ) రావడం తగ్గుతాయి. దాంతో పాటు చర్మం కాంతివంతం అవుతుంది.


Photos: గణపతి నిమజ్జనంలో సోనూసూద్ అండ్ ఫ్యామిలీ


 రాత్రి పూట కొన్ని నీళ్లల్లో జీలకర్ర నానపెట్టి వాటితో పొద్దున్నే ముఖం కడిగిగే ముఖం మెరుస్తుంది. నీటిలో జీలకర్ర వేసి ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖంపై ఉన్న మలినాలు తొలగిపోతాయి. ముఖంపై ఉన్న నల్లమచ్చలు కూడా తొలగిపోతాయి. చర్మంలో రక్తప్రసరణను పెంచుతుంది. ఈ చిట్కాలు మీ జీవితంలో ( Lifestyle ) భాగం చేసుకుని ఆరోగ్యంతో పాటు అందం సొంతం చేసుకోండి.



Viral Video: ఈ వీడియోలో చిరుత ఎక్కడుందో కనుక్కోగలరా ? ట్రై చేయండి