Viral Video: ఈ వీడియోలో చిరుత ఎక్కడుందో కనుక్కోగలరా ? ట్రై చేయండి

అడవిలో బతకడం అంత సులువు కాదు. ప్రతీ క్షణం ఎక్కడో ఒక చోట ప్రమాదం పొంచి ఉంటుంది. 

Last Updated : Aug 27, 2020, 03:59 PM IST
    • అడవిలో బతకడం అంత సులువు కాదు. ప్రతీ క్షణం ఎక్కడో ఒక చోట ప్రమాదం పొంచి ఉంటుంది.
    • పొదల మాటున మరణం దాగి ఉంటుంది.
    • దాన్ని పసిగట్టిన జంతువు బతికి బట్టకడుతుంది. లేదంటే వేటాడే జంతువుకి ఆహారం అవుతుంది.
Viral Video: ఈ వీడియోలో చిరుత ఎక్కడుందో కనుక్కోగలరా ? ట్రై చేయండి

అడవిలో బతకడం అంత సులువు కాదు. ప్రతీ క్షణం ఎక్కడో ఒక చోట ప్రమాదం పొంచి ఉంటుంది. పొదల మాటున మరణం దాగి ఉంటుంది. దాన్ని పసిగట్టిన జంతువు బతికి బట్టకడుతుంది. లేదంటే వేటాడే జంతువుకి ఆహారం అవుతుంది. అలాగే అడవిలో వేటాడటానికి కొన్ని జంతువులు మాటువేయండంలో ఎక్స్ పర్ట్ గా మారాయి.

ఉదాహరణకు ఈ చిరుత పులి ( Leopard ).  మీరు ఈ వీడియో ( Trending Video ) చూస్తే మీకు చివరి వరకు చిరుత ఎక్కడుంది అనేది మీరు కనుక్కోలేరు. ఫైనల్ గా చిరుత ఎక్కడుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.ఒక పొదల మాటునుంచి జింకలు రోడ్డుపైకి వస్తుంటాయి. ఒకటీ రెండూ.. ఇలా జింకలు రోడ్డుపైకి వస్తుంటాయి.

అక్కడ రోడ్డుపై ఒక చిన్న బండరాయి మాత్రమే కనిపిస్తుంది. కానీ క్షణాల్లో అది కదులుతుంది. అది చివరికి చిరుతపులి అని మీరు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ( Viral Video ) ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media )బాగా వైరల్ అవుతోంది.

Trending News