Jaggery Tea : ఈ టీతో ఎన్నో లాభాలు.. పీరియడ్స్ పైన్..బరువు.. రెండిటికి చెక్
Jaggery benefits: బెల్లం టీ.. వినడానికి విచిత్రంగా ఉన్న తాగడానికి కమ్మగా ఉంటుంది. టేస్ట్ పరంగానే కాదు ఈ టీ తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులతో పాటు మన బరువు కూడా తగ్గుతుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..
Jaggery tea: బెల్లం.. చక్కెరకు ప్రత్యామ్నాయంగా మనలో చాలామంది వంటలు ఉపయోగించే ఈ బెల్లం పీరియడ్ సమయంలో ఆడవారు పడే భయంకరమైన నొప్పిని మటుమాయం చేస్తుంది. అంతేకాదు అధిక బరువుని నియంత్రణలో ఉంచడమే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఆ బెల్లం టీ ఎలా చేస్తారో చూద్దామా..
ఈ చలికాలంలో వీచే చల్లని గాలుల కారణంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో పాటుగా కీళ్లు ,కాళ్లు నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఇక ఈ టైంలో పీరియడ్స్ పెయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టైంలో పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళకి పెద్ద సవాలు అనే చెప్పాలి. ఈ సీజన్లో ఫిట్ గా ఉంచడంతోపాటు పలు రకాల అనారోగ్య సమస్యలకు గుడ్ బై చెప్పే చిన్ని చిట్కా బెల్లం టీ.
బెల్లం టీ అనేది కొత్త వంటకం ఏమీ కాదు .వాస్తవానికి మన పెద్దల కాలం నుంచి ఈ టీ ని చలికాలంలో తాగేవారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ టీ ని రోజు పొద్దున ఇంటిలపాది తీసుకోవచ్చు. ఈ టీ మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి పరిచి పలు రకాల ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్ ,విటమిన్ బి తో పాటు అనేక పోషక విలువలు ఉన్నాయి.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా చలికాలం మన మెటబాలిజం మందగించకుండా బెల్లం టీ కాపాడుతుంది.
దీని కారణంగా చలికాలంలో అధిక బరువు పెరగకుండా ఉంటారు. పీరియడ్స్ సమయంలో తలనొప్పి, వికారం ,వాంతులు ,నొప్పులు ,కాళ్ళ తిమ్మిర్లు లాంటివి ఈ కాలంలో చాలా సహజంగా వస్తాయి. అలాంటప్పుడు బెల్లం టీ..అప్పుడప్పుడు తాగుతూ ఉండడం వల్ల ఉపశమనం పొందుతారు. ఈ టీ తయారు చేసుకోవడానికి రెండు కప్పు నీళ్లలో మూడు టేబుల్ స్పూన్లు తురిమిన బెల్లం ,ఒక టేబుల్ స్పూన్ టీ పొడి, కాస్త అల్లం ,యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిటికెడు మిరియాల పొడి ఒక మందపాటి గిన్నెలో తీసుకొని బాగా మరిగించాలి. కాస్త చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత వడగట్టుకుని తాగితే సరిపోతుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook