Health Benefits of Kantola Spiny Gourd: బీపీని అదుపులో పెట్టే గుణాలు : 
బోడ కాకర కాయ తింటే బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. అందుకే బీపీ పేషెంట్స్ కి ఇది మంచి డైట్ అని డైటీషియన్స్ చెబుతుంటారు. బోడ కాకర కాయతో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ, తక్కువ కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆహారపు అలవాట్ల ద్వారా బీపీనీ కంట్రోల్ చేయడానికి మన ముందున్న సహజ పద్ధతుల్లో ఇది కూడా ఒకటి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జలుబు, గాలి ద్వారా సోకే వైరస్‌లకు చెక్ :
కొంతమంది తరచుగా సాధారణ జలుబుతో బాధపడుతుంటారు. అలాంటి వారికి బోడ కాకర కాయ ఎంతో మేలు చేస్తుంది. సాధారణ జలుబుని నివారించడంలో బోడ కాకర కాయ ఎంతో సహాయపడుతుంది. అలాగే గాలి ద్వారా సోకే వైరస్ లని నివారించడంలోనూ బోడ కాకరకాయ పని తీరు మెరుగ్గా ఉంటుంది.


అధిక బరువు తగ్గించే ఔషద విలువలు :
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బాధపడుతున్న అంశం ఏదైనా ఉందా అంటే అది అధిక బరువును తగ్గించుకోవడమే. అందుకోసం నానా రకాల డైటింగ్స్ చేస్తున్నారు.. ఎన్నో రకాల కుస్తీలు పడుతున్నారు. అంత పెద్ద సమస్యకు చెక్ పెట్టే ఆహారపదార్థాల్లో ఈ బోడ కాకర కాయ కూడా ఒకటి.


యవ్వనం పోకుండా కాపాడే గుణాలు :
యవ్వనం పోకుండా కాపాడే గుణాలు బోడ కాకర కాయలో పుష్కలంగా ఉన్నాయి. బోడ కాకర కాయతో చర్మం నిగాపరింపును కోల్పోకుండా ఉండి యాంటీ-ఏజింగ్ అనిపించకుండా చేస్తుంది. 


కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే..
కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే తరచుగా బోడ కాకర కాయ తినడం అలవాటు చేసుకోవాలి. ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో కిడ్నీలో రాళ్లు కూడా ఒకటి. కానీ అసలు ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే తరచుగా బోడ కాకర కాయ తినడం మంచిది. 


కంటి చూపు కోల్పోకుండా కాపాడే కూరగాయ : 
బోడ కాకర కాయ తినడం వల్ల కలిగే మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. బోడ కాకర కాయతో కంటి చూపు తగ్గకుండా కాపాడుతుంది. దృష్టి సమస్యలను నివారించాలంటే బోడ కాకర కాయ తరచుగా తినడం అలవాటు చేసుకోవాల్సిందే. 


మెదడుకు మేత :


మెదడుకు మేత అంటే ఏదైనా ఆలోచించేలా మెదడుకు పని చెప్పే వంటి వాటిని మెదడుకు మేత అని అంటుంటాం కానీ బోడ కాకర కాయ మాత్రం నిజంగానే మెదడుకు మేతలా పనిచేస్తుందట. మెదడు పనితీరులో చురుకుదనం పెంచే గొప్ప ఔషదాల్లో బోడ కాకర కాయ కూడా ఒకటి. బోడ కాకరకాయ తినడం వల్ల బ్రెయిన్ వేగంగా పని చేస్తుంది అని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.