Mint Benefits: పుదీనా తింటున్నారా, ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి
Health Benefits of Mint leaves: పుదీనా తినడం ద్వారా పలు రకాల పోషకాలు లభిస్తాయి. విటమిన్ ఏ సైతం అందుతుంది. తద్వారా కంటిచూపు మెరుగయ్యేందుకు, నోటి దుర్వాసన తగ్గించుకునేందుకు పుదీనా ఆకులను తింటారు.
Health Benefits of Mint leaves: దాదాపు 12 రకాల జాతులను పుదీనా అని పిలుస్తారు. అయితే వీటి ముఖ్య లక్షణం చల్లదనాన్ని కలిగించడం. అందుకు ఆహారంలో కొద్దిపాటిగా పుదీనా ఆకులను తీసుకుంటారు. పుదీనా తినడం ద్వారా అలెర్జీ సమస్యలు తగ్గుతాయి, అస్తమా సమస్య ఉన్నవారికి సైతం ఉపశమనం కలిగిస్తుందని, మరెన్నో ప్రయోజనాలు (Benefits of Mint Leaves) ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు సైతం చెబుతుంటారు. భారతీయులు తమ వంటకాలలో పుదీనాను ఆకులను విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇది నోటి దుర్వాసన పోగొట్టడంలో తోడ్పడుతుంది.
పుదీనా తినడం ద్వారా పలు రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఫైబర్, విటమిన్ ఏ, ఐరన్, మాంగనీస్, ఫొలెట్ మన శరీరానికి లభిస్తాయి. కొందరు కడుపు నొప్పికి పుదీనా ఆకులను తినడం ద్వారా ఉపశమనం పొందుతారు. అజీర్తి సమస్యలు (Digestion Problem Tips) ఉన్నవారు సైతం పుదీనా తిని తమ సమస్యను పరిస్కరించుకుంటారు. మెదడు పనితీరును మెరుగుచేస్తుంది. పాలిచ్చే తల్లులు ఇది తినడం ద్వారా పాలుపట్టిన సమయంలో కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
Also Read: Benefits Of Carrots: కోవిడ్19 సమయంలో క్యారెట్ తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు
పుదీనా తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు (Health Benefits of Mint Leaf)
- నోటి దుర్వాసన, శ్వాస సంబంధ సమస్యలు ఉన్న వారికి పుదీనా పరిష్కారం చూపుతుంది.
- పుదీనా ఆకులు తింటే పలు పోషకాలు లభిస్తాయి. ఫైబర్, విటమిన్ ఏ (Vitamin A), ఐరన్, మాంగనీస్, ఫొలెట్ మన శరీరానికి అందుతాయి.
- కొందరికీ కొన్ని రకాల వంటలు తింటే అలెర్జీ సమస్యకు గురవుతారు. తరచుగా పుదీనా తినే వారిలో ఈ సమస్య తక్కువగా ఉంటుంది.
Also Read: benefits of eating almonds: రోజుకు రెండుసార్లు బాదం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- పుదీనా ఆకులను తినడం ద్వారా కొందరు కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
- అజీర్తి సమస్యలు ఉన్నవారు సైతం పుదీనా తిని తమ సమస్యకు పరిష్కారం దొరికిందని చెబుతుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook